ఖాళీ బిందెలతో నిరసన
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:39 PM
వీరఘట్టం మేజర్ పంచాయతీలో పూర్తిస్థాయిలో తాగునీరు అందజేయాలని కోరుతూ స్థానిక మహిళలు పంచాయతీ కార్యాలయం ముందు గురువారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.

వీరఘట్టం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): వీరఘట్టం మేజర్ పంచాయతీలో పూర్తిస్థాయిలో తాగునీరు అందజేయాలని కోరుతూ స్థానిక మహిళలు పంచాయతీ కార్యాలయం ముందు గురువారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మేజర్ పంచాయతీ అయినప్పటికీ గ్రామంలో పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదన్నారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగడం లేదని, వీధుల్లో రోడ్లు గుంతల మయంగా మారాయన్నారు. అనంతరం పంచాయతీ ఇన్‌చార్జి ఈవో కోటేశ్వరరావు, ఎంపీడీవో బి.వెంకటరమణకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఇందిర, నాయకుడు సింహాచలం పాల్గొన్నారు.