ఏనుగుల జోన్ వద్దు
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:41 PM
మండలంలోని రేపటివలస సమీపంలోని అమ్మాదేవి కొండ పరిధిలో చేపడుతున్న ఏనుగుల జోన్ పనులను ఆయా గ్రామాల ప్రజలతో పాటు సీపీఎం నాయకులు గురువారం అడ్డుకున్నారు.

సీతానగరం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రేపటివలస సమీపంలోని అమ్మాదేవి కొండ పరిధిలో చేపడుతున్న ఏనుగుల జోన్ పనులను ఆయా గ్రామాల ప్రజలతో పాటు సీపీఎం నాయకులు గురువారం అడ్డుకున్నారు. గిరిజనులు, దళితులు సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలని, అలాగే ఎఫ్‌ఆర్‌వో, డిపట్టా భూములకు నష్ట పరిహారం ఇప్పించి బాధితుల కు న్యాయం చేయాలని సీపీఎం నాయకుడు మూడడ్ల కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఎటువంటి అరెస్టులు, కేసులకు భయపడి వెనక్కి తగ్గేది లేదన్నారు. ఈ సంద ర్భంగా అటవీశాఖ అధికారులు బి.రామనరేష్ మణి కంఠేష్, మనోజ్, తహసీల్దార్ ప్రసన్న, రూరల్ సీఐ గోవిందరావు మాట్లాడుతూ ఏనుగుల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవన్నారు. జోన్ పనులు జరగవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్ర మంలో ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎస్‌ఐ ఎం.రాజేష్‌తో పాటు సీపీఎం జిల్లా కమిటీ నాయకులు రెడ్డి వేణు, మండల నాయకులు రెడ్డి ఈశ్వరరావు, గవర వెంకటరమణ పాల్గొన్నారు.