Share News

మెరుగైన సేవలందించడమే లక్ష్యం

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:29 PM

ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. గురువారం పాతపట్నంలోని 50 పడకల సీహెచ్‌సీలో డిజిటల్‌ ఎక్స్‌రే విభాగా న్ని ప్రారంభించారు.

 మెరుగైన సేవలందించడమే లక్ష్యం
పాతపట్నం: మాట్లాడుతున్న మామిడి గోవిందరావు

పాతపట్నం, మార్చి27(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. గురువారం పాతపట్నంలోని 50 పడకల సీహెచ్‌సీలో డిజిటల్‌ ఎక్స్‌రే విభాగా న్ని ప్రారంభించారు. తొలుత ఆసుపత్రిలో పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైద్యులు చిత్తశుద్ధితో వ్యవహరించి రిఫర్‌చే యడానికి ప్రాధాన్యతనివ్వకుండా సేవలందించాలని కోరారు. 100పడకల ఆసుపత్రిగా రూపొందిస్తామని తెలిపారు.కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రకుమా రి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కృష్ణారావు పాల్గొన్నారు.

ఫకొత్తూరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): మారుమూల గ్రామీణ రహదారులు అభి వృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మండలంలోని సిరుసువాడ-కుంటిబద్ర గ్రామాల లింకు రోడ్డుకు సిరుసవాడలో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల ఉపాఽధ్యక్షుడు ఎల్‌.తులసీ వరప్రసాదరావు, సర్పంచ్‌ పోలినాయుడు, అగతముడి అరుణకుమార్‌, పొత్రకొండ మోహనరావు, పడాల లక్ష్మణరావు, అగతముడి మాధవరావు, సుధాకరరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:29 PM