Share News

ప్రజల అభిమతాన్ని గౌరవిస్తున్నాం

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:43 AM

బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణారావుపై అవిశ్వాస తీర్మానం పెట్టే అంశంపై మాజీ మంత్రి, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆర్‌వీ సుజయ్‌ కృష్ణరంగారావు స్పష్టత ఇచ్చారు.

 ప్రజల అభిమతాన్ని గౌరవిస్తున్నాం

బొబ్బిలి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణారావుపై అవిశ్వాస తీర్మానం పెట్టే అంశంపై మాజీ మంత్రి, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆర్‌వీ సుజయ్‌ కృష్ణరంగారావు స్పష్టత ఇచ్చారు. బొబ్బిలి కోటలోని తన నివాసంలో మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ప్రజల అభిమతాన్ని గౌరవిస్తున్నాం.. బొబ్బిలి మున్సిపాలిటీ పాలకపక్షాన్ని మార్చాల్సిన తరుణం ఆసన్నమైందని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఆనాడు స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎలా నిర్వహించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. బొబ్బిలి పురపాలక సంఘం ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థులను భయ పెట్టి ప్రలోభాలకు గురిచేసి వైసీపీ విజయం సాధించిందన్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, అవినీతి పెచ్చుమీరి పోయిందన్నారు. నాలుగేళ్లుగా అసమర్థ, అవినీతి పాలన సాగిందని వైసీపీ కి చెందిన కౌన్సిలర్లే ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు. చైర్మన్‌ పదవికి అనర్హుడని వారే అంటున్నారని చెప్పారు. వైసీపీ కౌన్సిలర్లంతా ఇలా ముందుకు రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.

Updated Date - Mar 26 , 2025 | 12:43 AM