ఏఎంసీలకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:41 AM
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలు పంపాలని నియోజకవర్గ నాయకత్వానికి అధిష్ఠానం నుంచి సంకేతాలు వచ్చా యి. రిజర్వేషన్‌లు ఖరారయ్యాయి. జనరల్, బీసీ, ఎస్సీ కేటగిరీలకు అవకాశం కల్పించారు.

రిజర్వేషన్లు ఖరారు
జాబితాలు పంపాలన్న అధిష్ఠానం
(భీమవరం–ఆంధ్రజ్యోతి) :
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలు పంపాలని నియోజకవర్గ నాయకత్వానికి అధిష్ఠానం నుంచి సంకేతాలు వచ్చా యి. రిజర్వేషన్‌లు ఖరారయ్యాయి. జనరల్, బీసీ, ఎస్సీ కేటగిరీలకు అవకాశం కల్పించారు. జిల్లాలో ఉన్న పది ఏఎంసీలకు రిజ ర్వేషన్‌లను నిర్ధారించారు. నియోజకవర్గ నేతలకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్‌కు రిజర్వేషన్ ఖరారు బాధ్యతలను అప్పగించారు. తదనుగుణంగా ఎంపిక ప్రక్రియపై నియోజకవర్గ బాధ్యులు కసరత్తు చేస్తున్నారు. మహిళలకు 50 శాతం కేటాయించారు. జిల్లాలో ఐదు ఏఎంసీలను మహిళలకు రిజర్వ్ చేశా రు. మార్కెట్ కమిటీలపై ఎప్పటి నుంచో కూటమి శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నియోజకవర్గ ఎమ్మెలేలు, ఇన్‌చార్జిలను కలుసుకున్నారు.
రిజర్వేషన్ లు ఖరారైన తర్వాత ఆశావహుల ఆశలకు గండి పడింది. జనర ల్ కేటగిరీలో ఏఎంసీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న నాయకులు ఢీలా పడ్డారు. అంచనాలు తారుమారయ్యాయి. కలెక్టర్ సైతం రిజర్వేషన్‌లను గోప్యంగా ఉంచారు. అధికారికంగా బహిర్గతం చేయలేదు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ఇన్‌చార్జిలకు మాత్రమే సమాచారం ఇచ్చారు. చివరి నిమిషం వరకు మారే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో అధికారులు గోప్యత పాటిస్తున్నారు.
జాబితాలు సరే
జాబితాలు వెళ్లిన తర్వాత నియామకాలు ఎప్పటిలోగా చేపడతారన్న దానిపై మీమాంస నెలకొంది. ఆలయాలు, ఏఎంసీలకు జాబితాలు పంపాలంటూ అధిష్ఠానం సూచించింది. కూటమి పార్టీల మధ్య సయోధ్య కుదరాలి. అధిష్ఠానం మాత్రం జిల్లాలోని పది ఏఎంసీలను ఏ పార్టీకి కేటాయించాలనే దానిపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది. ఆ దిశగా జాబితాలు పంపాలంటూ ఆదేశాలు అందాయి. ఇప్పటికే సహకార సంఘాల జాబితాలను పంపారు. వాటి నియామకం ఇంకా చేపట్టలేదు. నెలలు గడచిపోతున్నాయి. ప్రభుత్వం నియామకాలు జోలికి పోలేదు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. నామినేటెడ్ పదవుల విషయంలో అన్యాయం జరుగుతోంది. ఎన్నికల ముందు వచ్చిన వారికి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు సిఫారసు చేశారు. దీనిపై సొంత పార్టీ శ్రేణులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు గడిచిన ఐదేళ్లపాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న వారు ఇప్పుడు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటూ పదవులు తెచ్చుకోవాలని తహతహలాడుతున్నారు. నియోజకవర్గాల్లో ఈ విషయమై కూటమి శ్రేణుల్లో పెద్ద చర్చే నడుస్తోంది. తాము కష్టపడితే పదవులు పొందిన వారు నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారంటూ మదన పడుతున్నారు. అధిష్ఠానం మాత్రం గత ఐదేళ్లు కష్టపడ ్డ వారికి మాత్రమే అవకా శం ఇవ్వాలని స్పష్టం చేస్తోంది. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారిని తక్షణం పదవులు ఇవ్వకూడ దంటూ జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వారి సేవలు వినియోగించుకున్న తర్వాత భవిష్యత్తులో పదవుల విషయం చూడాలని దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఇన్‌చార్జి మంత్రి ఆ బాధ్యతను సక్రమంగా చూసుకోవాలని సంకేతాలు ఇచ్చారు.
కాలాతీతం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తి కావచ్చింది. ఇప్పటికే నామి నేటెడ్ పదవులు భర్తీ చేస్తే ఏడాది కాలానికి మళ్లీ కొత్త వారికి అవకాశం దక్కేది. ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏడాది కాలానికి నియమిస్తున్నారు. అవసరమైతే ఆరు నెలలు పొడిగిస్తూ వస్తున్నారు. ఏడాది కాలానికి పాలకవర్గాలు ఏర్పాటు చేస్తే అత్యధికులకు సంతృప్తి పరిచే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్‌ల విషయంలోనూ అన్ని వర్గాలకు సమప్రాధాన్యం లభిస్తుంది. ఇప్పటికైనా అధిష్ఠానం జాప్యాన్ని నివారించాలంటూ కేడర్ ఎదురుచూస్తోంది. ఉగాది నాటికి నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారంటూ అంతా ఆశిస్తున్నారు.
రిజర్వేషన్లు ఇలా
భీమవరం–జనరల్ మహిళ, ఉండి–జనరల్, అత్తిలి–జనరల్, పాలకొల్లు–బీసీ జనరల్, ఆకివీడు–బీసీ జనరల్, ఆచంట–బీసీ మహిళ, తాడేపల్లిగూడెం–ఎస్సీ జనరల్, తణుకు–ఎస్సీ మహిళ,
పెనుగొండ–ఓసీ మహిళ, నరసాపురం–ఓసీ జనరల్