నిట్ నుంచి గేట్
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:32 AM
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ఫలితాలలో తాడేపల్లిగూడెం ఏపీ నిట్ విద్యార్థులు మంచి ర్యాంక్‌లు సాధించారు.

జాతీయ స్థాయి ర్యాంకులతో సత్తా చాటిన విద్యార్థులు
తాడేపల్లిగూడెం అర్బన్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ఫలితాలలో తాడేపల్లిగూడెం ఏపీ నిట్ విద్యార్థులు మంచి ర్యాంక్‌లు సాధించారు. జాతీయ స్థాయి ర్యాంకులతో సత్తా చాటారు. బీటెక్ విద్యార్థులు కె.నవ్య (బయోటెక్నాలజీ) 8వ ర్యాంకు, సీహెచ్.దినేష్ (ఈసీఈ) 23వ ర్యాంకు, డి.వర్దన్ (ఎలక్ట్రికల్) 40వ ర్యాంకు, శ్రీధర్ వర్మ కలిదిండి (సీఎస్ ఈ) 56వ ర్యాంకు, కె.కళాతులసి(బయో ఇన్ఫ ర్మేటివ్ ఇంజనీరింగ్) 102వ ర్యాంకు, అతిధి అనన్య (ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్) 164 వ ర్యాంకు సాధించారు. నలుగురు 100లోపు ర్యాంక్‌లు సాధించగా, 10 మంది 500లోపు, 12 మంది వెయ్యిలోపు ర్యాంకులు సాధించా రు. ఏపీ నిట్‌లో విద్యార్థులకు ప్రతీ సంవత్స రం గేట్ రాయడానికి ఉచిత శిక్షణ ఇస్తున్నా రు. ఈ శిక్షణ మంచి ర్యాంకులు సాధించ డానికి దోహదపడిందని విద్యార్థులు తెలిపా రు. ఇంజనీరింగ్ తరువాత ఎంటెక్‌లో చేరి ఉన్నత విద్యనభ్యసించడంతో పాటు కొన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో కొలువుల సాధనకు గేట్ ర్యాంకులను ప్రామాణికం. దీంతో ఏపీ నిట్‌లో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు సాధించిన విజయం సంస్థకు ఎంతో గర్వకారణమని ఆచార్యులు చెబుతున్నారు. ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణారావు, రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్‌శంకర్‌రెడ్డి, డీన్ అకడమిక్ డాక్టర్ ఎన్.జయరాం, గేట్ ఉచిత శిక్షణ కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వినోద్‌కుమార్‌రాజా తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి
మాది విజయవాడ. మా నాన్న కె.శ్రీనివాసరావు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మా అమ్మ సుధారాణి గృహిణి. నేను ఏపీ నిట్‌లో బయోటెక్నాలజీ చదువుతున్నాను. గేట్‌లో 8వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. మా సంస్థలో గేట్ ఉచిత శిక్షణ ఇవ్వడం ఎంతో ఉపయోగపడింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించా లనేది నా లక్ష్యం.
– కె.నవ్య, బయోటెక్నాలజీ
విదేశాల్లో ఉన్నత చదువుకు వెళతా
మాది విశాఖపట్నం. ఏసీ నిట్‌లో ఈసీఈ చదువుతున్నాను. నాన్న హరి శివప్రసాద్, అమ్మ సుజాత. గేట్ పరీక్షలో 23వ ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. నిట్‌లో ఆచార్యులు మా చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. కాబట్టే మేము చదువులో ఇలా రాణిస్తున్నాం. విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనేది నా కోరిక.
– సీహెచ్ దినేష్, ఈసీఈ
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లక్ష్యం
మాది వరంగల్. మా నాన్న కుమారస్వామి సివిల్ ఇంజనీర్. అమ్మ స్వప్న గృహిణి. గేట్‌లో సంస్థ అందిస్తున్న శిక్షణ మా భవిష్యత్ కు బంగారు బాటలు వేసింది. ప్రశ్నలు ఎలా వస్తాయి, జవాబులు ఎలా రాయాలనే దానిపై మంచి శిక్షణ ఇచ్చారు. నేను గేట్‌లో 40వ ర్యాంకు సాధించగలిగాను. భవిష్యత్‌లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో స్థిరపడాలనేని నా లక్ష్యం.
– డి.వర్థన్, ఎలక్ట్రికల్