దివ్యాంగులకు..శాశ్వత కార్డు
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:33 AM
శారీరక మానసిక అంధులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శాశ్వత గుర్తింపు కార్డు జారీకి కేంద్రం శ్రీకారం చుట్టింది.

యూనిఫైడ్ ఐడీ పేరుతో గుర్తింపు కార్డు అందించేలా కేంద్రం శ్రీకారం
ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
కార్డులు నేరుగా ఇంటికే పంపుతున్న ప్రభుత్వం
యూడీఐడీ పోర్టల్‌తో సదరం సేవలు సులభతరం
ఏలూరురూరల్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : శారీరక మానసిక అంధులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శాశ్వత గుర్తింపు కార్డు జారీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. గతంలో దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షే మ పథకాలకు సదరం సర్టిఫి కెట్ తప్పనిసరి. ఈ సర్టిఫికెట్ తో బస్సు, రైల్వే పాస్‌లకు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకునేవారు. వీటి స్థానంలో మొత్తంగా కేంద్రం యూడీఐడీ (యూనిఫైడ్ డిజెబులిటీ ఐడెంటీ కార్డు) ఒకే కార్డు తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియ జిల్లాలో మొద లైంది. మీ–సేవ, ఇంటర్నెట్, మొబైల్, ఆన్‌లైన్‌లో స్వావలంబన కార్డు జీవోజీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి వివరాలు పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన రాష్ట్రాల్లోను ఈ గుర్తిం పు కార్డులతో ప్రయాణ రాయితీలు పొందవచ్చు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుకో చ్చు. ఈ కార్డులో ఆధార్, వైకల్య శాతం, ఇతర వివ రాలను పొందుపరుస్తున్నారు. ఈ ఐడీని స్కాన్ చేస్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వాస్తవానికి 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టింది. సదరం సర్టిఫికెట్ స్థానంలో ప్రత్యేక కార్డును ప్రవేశపెట్టింది. అప్పట్లో మెప్మా అధి కారులు కొంతమందికి పంపిణీ చేసి మిగిలిన వారికి ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ విధానాన్ని అప్‌డేట్ చేసి స్మార్ట్ కార్డును కేంద్రం తీసుకొచ్చి సదరం సులభతరం చేసింది. ఈ–పోర్టల్ ద్వారా సదరం శిబిరాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్య పరీక్షలకు ఎక్కడకు, ఎప్పుడు రావాలనే విషయాలు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపుతారు. గతంలో ఐదు రకాల వైకల్యా లకు సంబంధించి వ్యాధులకు సదరంలో దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం యూడీఐడీ పోర్టల్‌లో 18 రకాల వైకల్యాలను చేర్చా రు. ఈ కార్డులను నెల రోజుల్లో తపాలాలో ఇంటికే పంపు తారు. లేదంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా తపాలా కార్యాలయాల వద్ద ఉంచుతున్నారు. ఐడీ నెంబర్ చెప్పి కార్డు తీసుకోవచ్చు.