TradeTalks: ఇండియాతో అమెరికా టారిఫ్స్ చర్చలు
ABN , Publish Date - Mar 24 , 2025 | 06:28 PM
దక్షిణ, మధ్య ఆసియాకు అసిస్టెంట్ యుఎస్ ట్రేడ్ ప్రతినిధి అయిన బ్రెండన్ లించ్ ఇండియాకు వస్తున్నట్టు అధికారిక సమాచారం వెలువడింది.యుఎస్ ప్రభుత్వ బృందంతో కలిసి ఆయన మార్చి 25 నుంచి 29 వరకు భారతదేశంలో పర్యటిస్తారు.

అధ్యక్షుడిగా ఎన్నికైంది మొదలు ట్రేడ్ టారిఫ్ బాదుడంటూ ప్రపంచదేశాల్ని బెదరగొడుతున్నారు అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్. ఇక అడపాతడపా ఇండియా పేరు ప్రస్తావించి మరీ మీరెంత టాక్స్ వేస్తే మేమూ అంతే వేస్తామంటూ రెసిప్రోకల్ టారిఫ్స్ హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాము ఎలాంటి టారిఫ్స్ ఇండియాపై విధిస్తామో ఏప్రిల్ 2వ తేదీన తెలుస్తుందని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. దీనిపై భారత మార్కెట్లు ఉత్సుకతతో ఎదురు చూస్తున్న వేళ అమెరికా ప్రతినిధి రేపు ఇండియాతో చర్చలకు వస్తున్నారు.ఇది భారత మార్కెట్లకు ఒకింత సానుకూల పరిణామమేనని చెప్పుకోవాలి.
దక్షిణ, మధ్య ఆసియాకు అసిస్టెంట్ యుఎస్ ట్రేడ్ ప్రతినిధి అయిన బ్రెండన్ లించ్ ఇండియాకు వస్తున్నట్టు అధికారిక సమాచారం వెలువడింది.యుఎస్ ప్రభుత్వ బృందంతో కలిసి ఆయన మార్చి 25 నుంచి 29 వరకు భారతదేశంలో పర్యటిస్తారు. యుఎస్-ఇండియా ద్వైపాక్షిక వాణిజ్య చర్చలలో భాగంగా ఆయన కేంద్ర వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ సహా భారత అధికారులతో కీలక సమావేశాలు జరుపుతారు.
ఐదు రోజుల పర్యటనలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం, ట్రేడ్ టారిఫ్స్ అమలు (Trade and Tariff) మొదలైన విషయాల గురించి చర్చలుంటాయని తెలుస్తోంది. లెవీలు, మార్కెట్ యాక్సెస్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించే పలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల గురించి కూడా ఇరు దేశాలు చర్చించబోతునట్టు సమాచారం. భారతదేశంతో పెట్టుబడి, మంచి వాణిజ్య సంబంధాన్ని నెరపేందుకు నిబద్ధతతో ఉన్నామని బ్రెండన్ లించ్ అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Stock Market Update: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
మంచి శకునాల్లో మొదటిది ఏంటంటే..
For More AP News and Telugu News