నిస్సాన్ నుంచి 2 కొత్త కార్లు
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:23 AM
జపాన్ కార్ల కంపెనీ నిస్సాన్.. భారత మార్కెట్లోకి 2 కొత్త కార్లను ప్రవేశపెట్టబోతోంది. అందులో 7 సీట్ల సామర్థ్యంతో కూడిన బీ-ఎంపీవీని (మల్టీ పర్పస్ వెహికిల్) కొత్త ఆర్థిక సంవత్సరం (2025-26) తొలినాళ్లలో...

వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి
గురుగ్రామ్: జపాన్ కార్ల కంపెనీ నిస్సాన్.. భారత మార్కెట్లోకి 2 కొత్త కార్లను ప్రవేశపెట్టబోతోంది. అందులో 7 సీట్ల సామర్థ్యంతో కూడిన బీ-ఎంపీవీని (మల్టీ పర్పస్ వెహికిల్) కొత్త ఆర్థిక సంవత్సరం (2025-26) తొలినాళ్లలో అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆ తర్వాత 5 సీట్ల సామర్థ్యంతో కూడిన కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేస్తామని పేర్కొంది. దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న ఈ రెండు కొత్త కార్లను కంపెనీ జపాన్‌లోని యోకోహామాలో ఈ మధ్యనే నిర్వహించిన గ్లోబల్ ప్రొడక్ట్ షోకాజ్ ఈవెంట్‌లో ప్రదర్శించింది. నిస్సాన్ ప్రస్తుతం మాగ్నైట్, ఎక్స్-ట్రయల్ మోడళ్లను మన మార్కెట్లో విక్రయిస్తోంది.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News