జీనోమ్ వ్యాలీలో సీజీటీ కేంద్రం
ABN , Publish Date - Mar 21 , 2025 | 02:11 AM
హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో సెల్, జీన్ థెరపీ (సీజీటీ), వైరల్ వెక్టార్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్...

రూ.650 కోట్ల పెట్టుబడి భారత్ బయోటెక్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో సెల్, జీన్ థెరపీ (సీజీటీ), వైరల్ వెక్టార్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) ప్రకటించింది. దీంతో సరసమైన ధరల్లో వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీ నుంచి రీజెనరేటివ్, పర్సనలైజ్డ్ థెరపీల విభాగంలోకి తమ నైపుణ్యాలను విస్తరించినట్టయిందని తెలిపింది. సుమారు రూ.650 కోట్ల (7.5 కోట్ల డాలర్లు)తో ఈ ప్లాంట్‌ను నెలకొల్పినట్లు బీబీఐఎల్ వెల్లడించింది. జీన్, సెల్ థెరపీలకు శాస్ర్తీయంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి క్యాన్సర్ రోగులకు రక్షణ కల్పించేందుకు ఇది సహాయకారి అవుతుందని పేర్కొంది. 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక సీజీటీ కేంద్రం బీబీఐఎల్ ప్రయాణంలో ఒక మైలురాయి అని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు. భారత్ బయోటెక్ చీఫ్ డెవల్‌పమెంట్ ఆఫీసర్ రేచస్ ఎల్లా ఈ కేంద్రానికి నాయకత్వం వహిస్తారు.
Also Read:
Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం
CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..
For Business News And Telugu News