Raghuram Rajan On US Tariffs: భారత్‌పై అమెరికా సుంకాల ప్రభావం స్వల్పమే: మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:27 PM
అమెరికా సుంకాల విధింపుతో భారత్‌పై ప్రభావం తక్కువేనని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ప్రతీకార సుంకాలతో అమెరికా ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేసుకుందని వ్యాఖ్యానించారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం భారత్‌పై స్వల్పంగా ఉంటుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. మొత్తం 60 దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేసుకుందని వ్యాఖ్యానించారు. ‘‘ఈ సుంకాల కారణంగా సమీప భవిష్యత్తులో అమెరికాపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫుట్‌బాల్ భాషలో చెప్పాలంటే ఇది సెల్ఫ్ గోల్’’ (Raghuram Rajan On US Tariffs)
‘‘భారత్ ఎగుమతులపై సుంకాలతో అమెరికాలో ఆయా ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. ఫలితంగా వాటికి డిమాండ్ తగ్గుతుంది. దీంతో, భారత్ వృద్ధిపై కూడా ప్రభావం పడుతుంది. అయితే, భారత్‌తో పాటు ఇతర దేశాలపై కూడా సుంకాలు విధించారు. దీంతో, అమెరికా ప్రజలకున్న ప్రత్యామ్నాయాలు కూడా తగ్గుతాయి. ఆయా దేశాలతో ఎగుమతుల కోసం భారత్ పోటీ పడుతోంది కాబట్టి, ప్రభావం కూడా స్వల్పంగానే ఉంటుంది’’
అమెరికా సుంకాల కారణంగా భారత్‌లో ధరలు తగ్గుతాయని కూడా ఉన్నారు. భారత్ ఉత్పత్తులు దేశంలోనే మిగిలిపోవడంతో పాటు చైనా నుంచి ఉత్పత్తులు కూడా భారత్‌లోకి వచ్చే అవకాశం ఉండటంతో ధరలు తగ్గుతాయని అన్నారు.
ఈ సమస్యను ఓ అవకాశంగా మలుచుకునే అవకాశం కూడా ఉందని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల దిగుమతులపై సుంకాలు తగ్గించడం ద్వారా అమెరికా వాణిజ్యం మెరుగుపడినా పడకపోయినా ఇండియాకు మెలు జరుగుతుందని తెలిపారు. మార్కెట్లో పోటీ పెరుగుతుందని అన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు వాణిజ్య పరంగా రక్షణాత్మక ధోరణులు అవలంబిస్తున్నాయని,
ఈ సమయంలో భారత్ నేర్పుగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. ఆసియాన్ దేశాలు, జపాన్ ఆఫ్రికా, ఐరోపా దేశాలవైపు చూడాలని అభిప్రాయపడ్డారు. చైనాతో ఉభయతారకమైన వాణిజ్య ఒప్పందాలకు ప్రయత్నించాలని కూడా సూచించారు. సార్క్ దేశాలతో కూడా బంధాలు బలోపేతం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు రాజకీయ బేధాభిప్రాయాలు అధిగమించాల్సి ఉంటుందని అన్నారు. ప్రాంతీయ గ్రూపులుగా ప్రపంచం విడిపోతున్న తరుణంలో దక్షిణాసియా మాత్రం ఇందుకు విరుద్ధంగా మిగిలిపోకూడదని తెలిపారు.
ఇది కూడా చదవండి
ఫారం-16 ఉంటేనే ITR ఫైలింగ్ చేయగలమా.. లేకపోతే ఏం చేయాలి..
అద్దె ఇంట్లో ఉంటున్నారా ఈ పొరపాటు చేస్తే మీ కొంప కొల్లేరే
ఉద్యోగుల కొంప ముంచిన ఏఐ.. ఆ కంపెనీలో వందల జాబ్స్ హుష్ కాకి