ఎస్‌బీఐ గృహ రుణగ్రహీతలకు శుభవార్త
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:36 AM
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ప్రామాణిక రుణ వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో అనుసంధానిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్), బాహ్య ప్రామాణిక రుణ రేటు (ఈబీఎల్‌ఆర్)ను పావు (0.25) శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

రెపో అనుసంధానిత రుణ రేట్లు 0.25శాతం తగ్గింపు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ప్రామాణిక రుణ వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో అనుసంధానిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్), బాహ్య ప్రామాణిక రుణ రేటు (ఈబీఎల్‌ఆర్)ను పావు (0.25) శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఈబీఎల్‌ఆర్ 9.15 శాతం నుంచి 8.90 శాతానికి దిగిరాగా.. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ 8.75 శాతం నుంచి 8.50 శాతానికి తగ్గింది. తగ్గించిన వడ్డీ రేట్లు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నెలలో ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించిన నేపథ్యంలో బ్యాంక్ ఆ ప్రయోజనాన్ని తాజాగా రుణగ్రహీతలకు బదిలీ చేసింది.
దీంతో ఎస్‌బీఐ నుంచి ఈబీఎల్‌ఆర్, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ అనుసంధానిత గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారిపై ఈఎంఐ భారం తగ్గనుంది. కాగా, ద్రవ్య సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్), బేస్ రేటు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్‌ఆర్) మాత్రం యథాతథంగా కొనసాగుతాయని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.