PAN Card: మీ పాన్ కార్డులో ఇది మీరు ఎప్పుడైనా గమనించారా?
ABN , Publish Date - Feb 24 , 2025 | 06:14 PM
PAN Card: బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. వాహనం కొనుగోలు చేయాలన్నా.. భూమికి సంబంధించి క్రయ విక్రయాలు జరపాలన్నా.. ఆస్తుల కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఇలా ప్రతి ఒక్కదానికి పాన్ కార్డు తప్పని సరి అయిపోయింది. పాన్ కార్డు లేకుంటే క్రయ విక్రయాలు జరగని పరిస్థితి నేడు నెలకొంది.

ప్రస్తుత కాలంలో.. ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో.. పాన్ కార్డు సైతం అంతే ముఖ్యమన్నది సుస్పష్టం. మరి ఈ రెండు కార్డులు లింక్ చేసుకోవాలని ఇప్పటికే కేంద్రం క్లియర్ కట్‌గా స్పష్టం చేసింది. అందుకోసం గడువు విధించింది. దానిని సైతం పొడిగించింది. అది కాస్తా ముగియడంతో.. ఆధార్ కార్డ్, పాన్ కార్డులను లింక్ చేయడం కోసం ప్రస్తుతం కేంద్రం గట్టిగానే ఛార్జ్ చేస్తోంది. ఇక పాన్ కార్డు బ్యాంకు లావాదేవీలకు అత్యవసరం అవుతోంది. నగదు లావాదేవీ ఒక లిమిట్ దాటితే.. అంటే రూ.50 వేలు జరిగితే.. పాన్ కార్డు తప్పనిసరి అన్న సంగతి అందరికి తెలిసిందే.
ఇంకా క్లియర్ కట్‌గా సోదాహరణగా వివరించాలంటే.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్, వాహనం కొనుగోలు.. భూమికి సంబంధించి క్రయ విక్రయాలు, ఆస్తుల కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఇలా ప్రతి ఒక్కదానికి పాన్ కార్డు తప్పని సరి చేసేసింది ప్రభుత్వం. పాన్ కార్డు లేకుంటే క్రయ విక్రయాలు జరగని పరిస్థితి నేడు నెలకొందంటే అతిశయోక్తి కాదు. అయితే పాన్ కార్డు అప్లై చేసుకుంటే.. జస్ట్ 10 రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది. అంతా ఒకే కానీ.. పాన్ కార్డు విషయంలో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా?
Also Read: రైతులకు అలర్ట్.. డబ్బులు పడ్డాయోచ్.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి..
పాన్ కార్డు కోసం పురుషులు, మహిళలు అంతా అప్లై చేస్తారు. అయితే ఎవరికైనా పాన్ కార్డులో తండ్రి పేరే ఉంటుంది. ఓ మహిళకు వివాహం అయితే.. ఆ తర్వాత ఆమె బాగోగులు అన్నీ ఆమె భర్తే చూసుకొంటాడన్న విషయం అందరికి తెలిసిందే. మరి అలాంటి వేళ.. మహిళలు అప్లై చేసి.. వారి భర్త పేరు కాకుండా పాన్ కార్డులో మాత్రం తండ్రి పేరే ఎందుకు ఉంటుందనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా?. లేదా అందుకు కొన్ని కారణాలున్నాయి.
Also Read: జగన్‌కి ఝలక్ ఇచ్చిన అసెంబ్లీ.. మేటర్ ఏంటంటే..
మహిళలకు చిన్న వయస్సులోనే ఉద్యోగాలు వస్తే.. అంటే వివాహం కాక ముందే ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. ఆమెకు ఆ ఇంటి పేరే ఉద్యోగం చివర వరకు కొనసాగుతోంది. ఉద్యోగ నిర్వహాణలో భాగంగా ఎక్కడ సంతకం చేయాల్సి వచ్చినా.. తన పుట్టింటి పేరుతోనే సంతకం చేస్తారు. అలాగే కొందరు మహిళలు, రెండో వివాహం చేసుకొంటారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
మరికొందరు మహిళలు విడాకులు తీసుకుంటారు. ఇక వితంతువులు సైతం ఉంటారు. అదే విధంగా రెండో వివాహం చేసుకున్న మహిళలు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో మహిళలు.. పాన్ కార్డులో పేర్లు మార్చ వలసి వస్తోంది. అలాంటి వేళ.. మహిళలకు తండ్రి ఒక్కరే ఉంటారు. ఈ నేపథ్యంలో పాన్ కార్డులో మహిళలకు సైతం తండ్రి పేరు ఉంచారని ఆదాయపు పన్నుశాఖ వారు స్పష్టం చేశారు.
For Business News And Telugu News