23,000 పైకి నిఫ్టీ
ABN , Publish Date - Mar 21 , 2025 | 02:01 AM
దలాల్ స్ట్రీట్‌లో వరుసగా నాలుగో రోజూ బుల్ ర్యాలీ కొనసాగింది. ఈక్విటీ మదుపరుల కొనుగోళ్ల జోరుతో గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 76,000, నిఫ్టీ 23,000 స్థాయిలను...

సూచీలకు ఫెడ్ బూస్ట్
సెన్సెక్స్ మరో 899 పాయింట్లు అప్
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో వరుసగా నాలుగో రోజూ బుల్ ర్యాలీ కొనసాగింది. ఈక్విటీ మదుపరుల కొనుగోళ్ల జోరుతో గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 76,000, నిఫ్టీ 23,000 స్థాయిలను మళ్లీ అధిగమించాయి. ఇంట్రాడేలో 1,000 పాయింట్లకు పైగా వృద్ధి చెందిన సెన్సెక్స్.. చివరికి 899.01 పాయింట్ల (1.19 శాతం) లాభంతో 76,348.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 283.05 పాయింట్ల (1.24 శాతం) వృద్ధితో 23,190.65 వద్ద ముగిసింది. అమెరికా సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ తాజా పరపతి సమీక్షలో ప్రామాణిక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించినప్పటికీ, ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లను మరో రెండు సార్లు తగ్గిస్తామని సంకేతాలివ్వడం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నిరవధిక అమ్మకాలకు ముగింపు పలికారన్న అంచనాలు మార్కెట్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపాయి.
గడిచిన నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 2,519.15 పాయింట్లు (3.41 శాతం) బలపడగా.. స్టాక్ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17.43 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.408.62 లక్షల కోట్లకు (4.73 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.
Also Read:
Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం
CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..
For Business News And Telugu News