Share News

జియో ఫైనాన్షియల్‌తో అలియాంజ్‌ జట్టు?

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:52 AM

జర్మనీకి చెందిన ఆర్థిక దిగ్గజం అలియాంజ్‌ గ్రూప్‌.. ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని జియో ఫైనాన్షియల్‌ కంపెనీతో చర్చలు జరుపుతోంది...

జియో ఫైనాన్షియల్‌తో అలియాంజ్‌ జట్టు?

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ఆర్థిక దిగ్గజం అలియాంజ్‌ గ్రూప్‌.. ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని జియో ఫైనాన్షియల్‌ కంపెనీతో చర్చలు జరుపుతోంది. జియో ఫైనాన్షియల్‌ ప్రారంభించే లైఫ్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ వ్యాపారాల్లో వాటా కోసం ఈ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ రెండు వ్యాపారాల్లో కనీసం 50 శాతం వాటా అయినా కావాలని అలియాంజ్‌ అడుగుతోంది. అలియాంజ్‌ ఇటీవలే బజాజ్‌ ఫైనాన్స్‌ గ్రూప్‌తో ఉన్న ఈ రెండు వ్యాపారాల నుంచి నుంచి తప్పుకుంది. బజాజ్‌ గ్రూప్‌ నుంచి తప్పుకున్నా ఈ రంగాల్లో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జియో ఫైనాన్స్‌తో జట్టు కట్టాలని భావిస్తోంది.

Also Read:

Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం

CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..

For Business News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 01:52 AM