Share News

నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుచేయాలి : ఎమ్మెల్యే వేగుళ్ల

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:54 AM

యువతకు ఆరోగ్యంతోపాటు ఆటపాటలు అవసరమని, అందుకు ఆటస్థలాలు, ఇండో ర్‌ స్టేడియంలను నిర్మించాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్ర భుత్వాన్ని కోరారు.

నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుచేయాలి : ఎమ్మెల్యే వేగుళ్ల

మండపేట, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): యువతకు ఆరోగ్యంతోపాటు ఆటపాటలు అవసరమని, అందుకు ఆటస్థలాలు, ఇండో ర్‌ స్టేడియంలను నిర్మించాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్ర భుత్వాన్ని కోరారు. తన నియోజకవ ర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆటస్థలాలు ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 2016 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మండపేట లో క్రీడా వికాస ప్రాంగణానికి రూ.రెండు కోట్లను కేటాయిస్తే తర్వాత అధికారం చేప ట్టిన వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నా రు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో అవుట్‌డోర్‌, మున్సిపల్‌ కార్యా లయం వద్ద, కపిలేశ్వరపురంలో ఇండోర్‌ స్టేడియంలు ఏర్పాటుచేయాలని కోరారు.

Updated Date - Mar 21 , 2025 | 01:54 AM