ITR 2025: పన్ను చెల్లింపుదార్లకు అలర్ట్.. మార్చి 31లోపే పూర్తి చేయాల్సిన పనులు ఇవే
ABN , Publish Date - Mar 27 , 2025 | 08:36 PM
మరికొద్ది రోజుల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అసెస్‌మెంట్ ఇయర్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైల్ చేసేవాళ్లు మార్చి 31 లోపే కొన్ని పనులు పూర్తి చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

మరి కొన్ని రోజుల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఆ తరువాత ఐటీఆర్ సీజన్ 2025 ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ వరకూ ఐటీఆర్ దాఖలుకు సమయం ఉన్నా నిర్లక్ష్యం వద్దని నిపుణులు చెబుతున్నారు. ఐటీఆర్ దాఖలుకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే కొన్ని పనులు చక్కబెట్టాలని చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
తప్పులు లేని కచ్చితమైన ఐటీఆర్ ఫైలింగ్స్‌తో అన్నిరకాల డిడక్షన్స్, మినహాయింపులు పొందొచ్చు. శాలరీలు తీసుకునేవారు. ఫ్రీలాన్సర్, వ్యాపారాలు ఇలా ఎవరైనా సరే టాక్స్ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
పాత పన్ను విధానం ఎంచుకున్న వారు పన్ను మినహాయింపులపై నిర్ధారణకు రావాలి. సెక్షన్ 80సీ, 80డీ, 80జీ ఆధారిత పెట్టుబడులకు సంబంధించిన చెల్లింపులన్నీ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే పూర్తిచేయాలి.
Also Read: భారత్‌కు కుబేరులు బై బై!
టీడీఎస్ లెక్కలు కచ్చితంగా ఉండేందుకు ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తమకు వర్తించే పన్ను మినహాయింపులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ తాము పని చేస్తున్న సంస్థలకు మార్చి 31లోపే ఇవ్వాలి. దీనితో డిడక్షన్స్ లాభాలను పూర్తి స్థాయిలో పొందొచ్చు. ఇవే కాకుండా, డిడక్షన్స్‌కు సంబంధించి ఇతర మార్పులు ఏమైనా ఉంటే త్వరగా మీ సంస్థలకు సమాచారం అందించాలి.
మీరు చెల్లించాల్సిన పన్ను పది వేలు దాటితే ముందస్తు పన్ను చెల్లింపులను మార్చి 31 లోపే పూర్తి చేయాలి. లేదా పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: బ్యాంకు ఖాతాలకు ఇక నలుగురు నామినీలు
క్యాపిటల్ గెయిన్స్, నష్టాలను ముదింపు వేసుకునేందుకు పెట్టుబడులపై వచ్చిన లాభనష్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. పన్ను భారం తగ్గించుకునేందుకు ఇతర అవకాశాలు ఉన్నాయేమో పరిశీలించాలి. ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ స్ట్రాటజీపై దృష్టి పెట్టాలి.
ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపే ఫార్మ్ 26ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్, టాక్స్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లల్లో టీడీఎస్, ముందస్తు పన్ను చెల్లింపులు, సెల్ఫ్ ఎసెస్‌మెంట్ వివరాలు అప్‌డేట్ అయ్యేలా జాగ్రత్త పడాలి. కంపెనీలు దాఖలు చేసే టీడీఎస్ వివరాలు.. ఫార్మ్ ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్ సరిపోయాయో లేదో ఉద్యోగులు చెక్ చేసుకోవాలి. ఏమైనా తేడాలు ఉంటే ఆ మేరకు మార్పులు చేర్పులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ మార్చి 31 లోపే పూర్తి చేసుకుంటే ఆ తరువాత ఐటీఆర్ ఫైలింగ్ సులభం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి