Ola Electric: ఉద్యోగులకు ఓలా షాకింగ్ న్యూస్.. వెయ్యి మందిపై వేటుకు సిద్ధం..?
ABN , Publish Date - Mar 03 , 2025 | 02:39 PM
గడిచిన కొన్ని త్రైమాసికాల్లో ఓలా సంస్థ వరుసగా నష్టాలనే నమోదు చేస్తోంది. దీంతో నష్ట నివారణ చర్యలో భాగంగా ఓలా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా (OLA) మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. లాభాలను పెంచుకునే క్రమంలో ఓలా మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో ఓలా సంస్థ వరుసగా నష్టాలనే నమోదు చేస్తోంది. దీంతో నష్ట నివారణ చర్యలో భాగంగా ఓలా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి (Layoffs in Ola).
ప్రొక్యూర్‌మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా పలు విభాగాల్లో ఈ కోత ఉండనున్నట్లు సమాచారం. దాదాపు ఐదు నెలల్లోనే ఓలా ఎలక్ట్రిక్ రెండోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. గతేడాది నవంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా వెయ్యి మందిపై వేటు వేసేందుకు సంస్థ సిద్ధమైంది. వరుస నష్టాలతో పాటు పలు వివాదాలు కూడా ఓలా సంస్థను ఇటీవలి కాలంలో వేధిస్తున్నాయి.
వాహనాల విక్రయం తర్వాత సర్వీస్ విషయంలో ఓలా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే వినియోగదారుల హక్కులు ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, చట్ట వ్యతిరేక వాణిజ్య పద్ధతులు అనుసరిస్తున్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి. అలాగే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఓలా ఎలక్ట్రిక్‌కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఓలా షేర్ ధరలు నానాటికీ పడిపోతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..