ఒప్పో ఎఫ్29 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్
ABN , Publish Date - Mar 21 , 2025 | 02:14 AM
స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త మిడ్-రేంజ్ ఫోన్లను తీసుకువచ్చింది. ఒప్పో ఎఫ్29 5జీ, ఒప్పో ఎఫ్29 ప్రో 5జీ పేరుతో....

రెండు వేరియంట్లలో లభ్యం.. ప్రారంభ ధర రూ.23,999
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త మిడ్-రేంజ్ ఫోన్లను తీసుకువచ్చింది. ఒప్పో ఎఫ్29 5జీ, ఒప్పో ఎఫ్29 ప్రో 5జీ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. దేశంలోని అన్ని రకాలైన వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఈ ఫోన్ల ను ఐపీ66, ఐపీ68, ఐపీ69 ప్రమాణాలతో తీసుకువచ్చినట్లు ఒప్పో ఇండియా ప్రొడక్ట్ కమ్యూనికేషన్స్ హెడ్ సావియో డిసౌజా వెల్లడించారు. బెంగళూరులోని ఎస్‌జీఎస్ (సొసైటీ జనరల్ డి సర్వియలెన్స్)లో ఈ ఎఫ్29 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ఐపీ ప్రమాణాలను పరీక్షించినట్లు పేర్కొన్నారు. దుమ్ము ధూళి, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవటంతో పాటు వర్షంలో తడిచినా, నీటిలో పడినా రక్షణ కల్పించేలా ఈ స్టాండర్డ్స్ ఉంటాయని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్, గ్రేటర్ నోయిడాలోని ప్లాంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్స్ ఉత్పత్తి చేస్తున్నట్లు డిసౌజా పేర్కొన్నారు. ఒప్పో ఎఫ్27 సిరీస్ తీసుకువచ్చిన సమయంలో అమ్మకాలు 30 శాతం మేర పెరిగాయని, ఎఫ్29 సిరీ్‌సకు అదే స్థాయిలో స్పందన వస్తుందని అంచనా వేస్తున్నట్లు డిసౌజా తెలిపారు.
ఈ నెల 27 నుంచి ఎఫ్29 5జీ మోడల్, ప్రో మోడల్ ఏప్రిల్ 1 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఫీచర్లు: ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ-అమోలిడ్ స్ర్కీన్‌తో ఒప్పో తీసుకువచ్చింది. ఇందులో ఎఫ్29 ప్రో 5జీ.. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ ప్రాసెసర్‌తో తీసుకురాగా ఎఫ్29 5జీని క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెనరేషన్ 1 ప్రాసెసర్‌తో తీసుకువచ్చింది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ల ప్రత్యేకతలు. వేరియంట్స్: ఒప్పో ఎఫ్29 5జీ.. 8జీబీ రామ్+128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.23,999గా ఉండగా 8జీబీ+256 జీబీతో కూడిన ఫోన్ ధర రూ.25,999గా ఉంది. కాగా ఎఫ్29 ప్రో 5జీ రూ.27,999 (8జీబీ+128జీబీ), రూ.29,999 (8జీబీ+256జీబీ), రూ.31,999 (12 జీబీ+256జీబీ)ధరతో అందుబాటులో ఉండనుంది.
Also Read:
Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం
CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..
For Business News And Telugu News