PPF Vs SIP: మీరు నెలకు రూ.10 వేలు పెట్టుబడి పెడతారా? పీపీఎఫ్, ఎస్‌ఐపీ ఏది ఎక్కువ రాబడి ఇస్తుందంటే..
ABN , Publish Date - Jan 07 , 2025 | 09:59 PM
ఒకే మొత్తం ఒకే కాలపరిమితిపై పెట్టుబడి పెట్టినప్పుడు పీపీఎఫ్‌తో పోలిస్తే ఎస్ఐపీలు ఎక్కువ ఆదాయాన్ని ఇస్తాయి. అయితే, ఎస్‌ఐపీలపై మార్కెట్ ఒడిదుడుకుల భయం ఉంటుంది కాబట్టి వ్యక్తులు తాము ఎంత వరకూ రిస్క్ తీసుకోగలమో అంచనా వేసుకుని ఓ నిర్ణయానికి రావాలి.

ఇంటర్నెట్ డెస్క్: వయసులో ఉన్నప్పుడు సంపాదన ఎంత ముఖ్యమో ఆదాయంలో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడి పెట్టడం కూడా అంతే ముఖ్యం. మరి నెలకు రూ.10 వేలను భవిష్యత్తు కోసం మదుపు చేయాలనుకున్న వారికి అనువైన పెట్టుబడి సాధనం ఏదో? పీపీఎఫ్, ఎస్ఐపీ రెండింట్లో ఏది ఎక్కువ పెట్టుబడి ఇస్తుందో ఈ కథనంలో చూద్దాం.
స్టాక్ మార్కెట్లో ఓ క్రమపద్ధతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్తమమైన మార్గం క్రమానుగత పెట్టుబడులు.. అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇందులో కొంత మొత్తాన్ని నెలవారీగా పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రూపాయి మారకం విలువ, కాంపౌండింగ్ వంటి వాటి కారణంగా దీర్ఘకాలంలో మంచి లాభాలు కళ్లచూడొచ్చు (Personal Finance).
SIP: ఎస్‌ఐపీ.. నెలకు రూ.11,111 చొప్పున జస్ట్ 15 ఏళ్లు పెట్టుబడి పెడితే..
ఇందుకోసం ఓ మ్యూచువల్ ఫండ్ ఎంచుకుని మన అకౌంట్లో ఆటో డెబిట్ ఫీచర్ ఎంచుకుంటే నెలలవారీగా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. నెట్ అసెట్ వ్యాల్యూ ఆధారంగా పెట్టుబడులకు యూనిట్‌లను కేటాయిస్తారు. దీర్ఘకాలంలో ఇవి పెట్టుబడిపై మంచి రాబడిని అందిస్తాయి.
ఉదాహరణకు ఏటా 1.2 లక్షలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు నెలవారీ 10 వేల చొప్పున ఎస్‌ఐపీ ద్వారా నిధులు మళ్లించొచ్చు. పదిహేనేళ్ల తరువాత ఈ మొత్తం వడ్డీతో కలిపి 50,45,760కి చేరుకుంటుంది. అయితే, అంతిమంగా లభించే మొత్తం మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి ఉంటుంది.
Bank Holidays 2025: జనవరి 2025లో బ్యాంక్ సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే
ఇక రిస్క్ ఇష్టం లేని వారికి ప్రభుత్వ నిర్వహణలోని పీపీఎఫ్ పథకం అత్యంత అనుకూలం. ఇందులో పెట్టిన పెట్టుబడి, రాబడిపై భరోసా ఉంటుంది. పీపీఎఫ్ ఏటా పెట్టుబడులపై 7.1 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తుంటుంది. దీని కాలపరిమతి 15 ఏళ్లు. ఆపై 5 ఏళ్ల చొప్పున పెట్టుబడిని పొడిగించుకోవచ్చు. వీటికి సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు కూడా ఉంది. ఇక పీపీఎఫ్‌లో ఏటా 1.2 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యురిటీ నాటికి రూ.32,54,567 మొత్తం వస్తుంది. కాబట్టి, వ్యక్తులు తమ రిస్క్ సామర్థ్యం ఎంతో అంచనా వేసుకుని అందుకు అనుగూణంగా నిర్ణయం తీసుకవాలి.
IRCTC: రైల్వే టికెట్ యూజర్లకు షాకిచ్చిన ఐఆర్‌సీటీసీ.. కానీ ఇప్పుడు
2025లో జోరుగా విదేశీ పెట్టుబడులు!