‘జేఏఎల్’పై అదానీ గ్రూప్ ఆసక్తి
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:17 AM
అదానీ గ్రూప్ మరో కొనుగోలుకు సిద్ధమవుతోంది. దివాలా ప్రక్రియలో ఉన్న జైపీ గ్రూప్ కంపెనీ జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్) కొనుగోలు కోసం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ సమర్పించింది...

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మరో కొనుగోలుకు సిద్ధమవుతోంది. దివాలా ప్రక్రియలో ఉన్న జైపీ గ్రూప్ కంపెనీ జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్) కొనుగోలు కోసం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ సమర్పించింది. అయితే అదానీ గ్రూప్ ఎంత మొత్తానికి ఈ బిడ్ సమర్పించిందీ వెల్లడి కాలేదు. జేఏఎల్ కంపెనీకి సిమెంట్, విద్యుత్, హోటల్స్, నిర్మాణ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. జేఏఎల్ కొనుగోలు ఈ రంగాల్లో పట్టు మరింత పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని అదానీ గ్రూపు భావిస్తోంది. తమ రుణాలు చెల్లించలేక పోవడంతో రుణదాతలు జేఏఎల్‌పై గత ఏడాది జూన్‌లో ఎన్‌సీఎల్‌టీ, అలహాబాద్ బెంచ్‌లో దివాలా పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20 నాటికి జేఏఎల్ రుణదాతలకు దాదాపు రూ.55,493 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News