Share News

MS Agarwal Foundries: రూ.1,200 కోట్లతో విస్తరణ

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:07 AM

హైదరాబాద్‌కు కేంద్రంగా ఉన్న ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ (ఎంఎస్ఏఎఫ్‌) రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 60 లక్షల టన్నుల నుంచి 1.2 కోట్ల టన్నులకు పెంచబోతున్నామని, 5,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ఎండీ ప్రమోద్‌ కుమార్‌ అగర్వాల్‌ తెలిపారు

MS Agarwal Foundries: రూ.1,200 కోట్లతో విస్తరణ

ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ ఎండీ ప్రమోద్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ (ఎంఎస్ఏఎఫ్‌) రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నాడిక్కడ మార్కెట్లోకి ఎంఎస్‌ లైఫ్‌ 600+ సీఆర్‌ఎస్‌ (కరోజన్‌ రెసిస్టెన్స్‌ స్టీల్‌) టీఎంటీ బార్స్‌ను కంపెనీ ఎండీ ప్రమోద్‌ కుమార్‌ అగర్వాల్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా అగర్వాల్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కంపెనీకి చెందిన ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వచ్చే 2-3 ఏళ్ల కాలంలో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీకి తెలంగాణలోని తూప్రాన్‌, ఏపీలోని నాయుడుపేట, మంత్రాలయంలో ప్లాంట్లున్నాయి. ఈ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 60 లక్షల టన్నులుండగా ప్రతిపాదిత పెట్టుబడులతో 1.2 కోట్ల టన్నులకు చేరుకుంటుందని అగర్వాల్‌ తెలిపారు. అలాగే ఈ విస్తరణ ద్వారా 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..


Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 05 , 2025 | 04:07 AM