ఏడు రోజుల లాభాలకు బ్రేక్
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:08 AM
గత వారం రోజులుగా స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న రిలీఫ్ ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 728.69 పాయింట్ల నష్టంతో 77,288.50 వద్ద ముగియగా నిఫ్టీ 181.80 పాయింట్ల నష్టంతో...

సెన్సెక్స్ 729 పాయింట్ల నష్టం
ముంబై: గత వారం రోజులుగా స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న రిలీఫ్ ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 728.69 పాయింట్ల నష్టంతో 77,288.50 వద్ద ముగియగా నిఫ్టీ 181.80 పాయింట్ల నష్టంతో 23,486.85 వద్ద ముగిశాయి. దీంతో సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 25 కంపెనీల షేర్లు నష్టాలతో క్లోజయ్యాయి. ఉదయం స్వల్ప లాభాలతోనే ప్రారంభమైనా ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ అమ్మకాలు బుధవారం సూచీలను కుంగదీశాయి. గురువారం ముగిసే డెరివేటివ్ కాంట్రాక్టుల సెటిల్‌మెంట్, ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చే డోనాల్డ్ ట్రంప్ సుంకాల భయాలు కూడా మార్కెట్‌ను వెంటాడాయి. అమ్మకాల ఒత్తిడి ఇలానే కొనసాగితే గురువారం నిఫ్టీకి 23,300 పాయింట్లు కీలక మద్దతు స్థాయి అవుతుందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News