Share News

Wife Assaults Husband: అక్రమబంధంపై నిలదీస్తే.. ముక్కలుగా నరికి బ్లూ కలర్ డ్రమ్‌లో పెడతా, భార్య వార్నింగ్

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:59 PM

భర్తని కుక్కని కొట్టినట్టు కొట్టింది. అక్రమ సంబంధంపై నిలదీసినందుకు ప్రియుడితో కలిసి మీరట్ ఊచకోత లాగా ఏపార్ట్ కాపార్ట్ కట్ చేసి డ్రమ్‌లో ప్యాక్ చేస్తానంటూ రెచ్చిపోయింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Wife Assaults Husband: అక్రమబంధంపై నిలదీస్తే..  ముక్కలుగా నరికి బ్లూ కలర్ డ్రమ్‌లో పెడతా, భార్య వార్నింగ్
Wife Assault husband

అక్రమ సంబంధంపై నిలదీసినందుకు ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తని కుక్కని కొట్టినట్టు.. కొట్టిన చోట కొట్టకుండా కొట్టింది ఆ భార్య. అంతటితో కోపం ఆగక మీరట్ లో జరిగినట్టు నిన్ను కూడా చంపి ముక్క ముక్కలుగా కోసి డ్రమ్ లో ప్యాక్ చేస్తానంటూ ప్రియుడుతో కలిసి బెదిరించింది. ఉత్తరప్రదేశ్(యూపీ)లో జరిగిందీ ఘటన. వీళ్లిద్దరిదీ ప్రేమ వివాహం కావడం ఇక్కడ మరో విశేషం. సదరు భార్య, భర్తని కొడుతున్న సీన్ మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఘటన వివరాల్లోకి వెళ్తే..


యూపీకి చెందిన జూనియర్ ఇంజనీర్ (JE) ధర్మేంద్ర కుష్వ, జాన్సీ పట్టణానికి చెందినవాడు. ప్రస్తుతం గోండా(యూపీలో మరో సిటీ)లోని జల్ నిగమ్‌లో పనిచేస్తున్నాడు. కుష్వ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం, "2016లో బస్తీ జిల్లాకు చెందిన మాయా మౌర్యాతో నాకు ప్రేమ వివాహం జరిగింది. మాకు కుమార్తె జన్మించిన తర్వాత నా భార్య పేరుతో మూడు కార్లు కొన్నాను. వాటికి కిస్తీలు చెల్లిస్తూ వచ్చాను. 2022లో మాయా పేరుతో ఒక భూమిని కొనుగోలు చేసి, ఆమె బంధువైన నీరజ్ మౌర్యాకు ఇంటి నిర్మాణ కాంట్రాక్ట్ ఇచ్చాను. ఈ సమయంలో మాయా తన బంధువుతో సన్నిహితంగా మారింది . కోవిడ్-19 సమయంలో నీరజ్ భార్య మరణించిన తర్వాత వారి సంబంధం మరింత బలపడింది." అని ధర్మేంద్ర పోలీసులకు చెప్పాడు.


ఇంకా ఏమన్నారంటే.. "2024 జూలై 7న మాయా, నీరజ్‌ను అభ్యంతరకర స్థితిలో చూశాను. వారిని అడ్డుకున్నప్పుడు తనపై దాడి చేసి మాయా ఇంటిని వదిలి వెళ్లిపోయింది. ఆగస్టు 25, 2024న మాయా, నీరజ్‌తో కలిసి ఇంటికి తిరిగి వచ్చి బలవంతంగా తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించింది. 15 గ్రాముల బంగారు గొలుసు, డబ్బుతో ప్రియుడితో కలిసి పరారైంది. దీనిపై సెప్టెంబర్ 1, 2024న పోలీసులకు ఫిర్యాదు చేశా. 2025 మార్చి 29న మళ్లీ తమ ఇంటికి ప్రియుడితో కలిసి వచ్చిన మాయా నా తల్లిని చంపుతానని బెదిరించింది. అడ్డుకున్నాని ఆమె తన ప్రియుడు నీరజ్‌తో కలిసి నాతల్లి మీద, నామీద దాడి చేసింది." అని చెప్పుకొచ్చాడు. ఆ సందర్భంలో, మాయా "నీవు ఎక్కువ మాట్లాడితే, నిన్ను మీరట్ ఊచకోత లాగా నరికి డ్రమ్‌లో ప్యాక్ చేస్తాను" అని వార్నింగ్ ఇచ్చిందని కూడా పోలీసులు చెప్పాడు ధర్మేంద్ర.


ఇదిలా ఉండగా, మాయ తన భర్తపై ఎదురు కేసు పెట్టింది. తన భర్త తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొంది. ధర్మేంద్ర తనను వేధిస్తున్నాడని, నాలుగు సార్లు గర్భస్రావం చేయించుకోమని బలవంతం చేశాడని ఆమె ఆరోపించింది. 2024 జూలైలో ధర్మేంద్ర తనను కొట్టాడని, దీనిపై మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టానని గుర్తు చేసింది. ఆ తర్వాత అతను విడాకుల కేసు దాఖలు చేసి, తనను ఇంటి నుండి బలవంతంగా గెంటివేశాడని ఆరోపించింది. కోట్వాలీ పోలీస్ స్టేషన్లో పెట్టుకున్న భార్యాభర్తలిద్దరి కేసులు కోర్టులో నడుస్తున్నాయి. ఈ ఘటనలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇంటి దగ్గరి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా భార్యా భర్తల మధ్య జరిగిన గొడవ వెలుగులోకి వచ్చింది.

ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. "భార్య వ్యవహారం గురించి అడిగిన పాపానికి వైపర్‌తో భర్తపై దాడి చేసింది. బ్లూ డ్రమ్ చూపిస్తూ మీరట్‌లో జరిగినట్లుగా తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేస్తానని బెదిరించింది. మీరు ఏదైనా చర్య తీసుకుంటారా లేక అతన్ని నిజంగా చంపే వరకూ వేచి చూస్తారా?" అంటూ నెటిజన్లు పోలీసుల్ని (@gondapolice) ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

ఇదేం విడ్డూరం.. తల్లికి కాన్పు చేసిన 13 ఏళ్ల బాలుడు..

ఆర్ఆర్‌తో ఓటమికి కారణం అదే.. సీఎస్‌కే కెప్టెన్

Updated Date - Mar 31 , 2025 | 01:57 PM