ఎవరు బాగున్నారని?
ABN , Publish Date - Apr 01 , 2025 | 02:12 AM
లోకంలో ఏది బాగుందని దేశంలో ఎవరు బాగున్నారని దిగువనోళ్లు దిగబడి దారిద్య్రంలో ఎగువనోళ్లు ఎగబాకుతూ సంపదల్లో విషాదాల కొమ్మలకు తలకిందులుగా...

లోకంలో ఏది బాగుందని
దేశంలో ఎవరు బాగున్నారని
దిగువనోళ్లు దిగబడి దారిద్య్రంలో
ఎగువనోళ్లు ఎగబాకుతూ సంపదల్లో
విషాదాల కొమ్మలకు తలకిందులుగా
వేళ్ళాడబడిన జీవితాశలు
మాయామోహాల సంకెళ్ళలో
గోసగోసగా గడ్డురోజులు
రాజ్యం! రచ్చల రగడల లొల్లి
అబద్ధాల అత్యాచారాల గల్లి
ఉచితాల ఊరడింపులు ఫ్రాడ్‌లు
హామీల సయ్యాటలు స్కామ్‌లు
తెగబలిసిన లంచావతారాలు
బురదల్లో కూరుకుపోయిన విలువలు
వినోదమంటూ వికృత చేష్టలు
క్రైమ్ అండ్ వయలెన్స్!
వ్యాపార మృగాల చిత్రప్రదర్శనలు
కోట్ల కలెక్షన్లకు తెరిచిన
రాబడుల మృత్యువు గేట్లు
జీవన నైతికత్వానికి తూట్లు
ఇన్సానియత్ ముర్ధాబాద్!
గుండాగర్దీ జిందాబాద్!
ఉన్మాదించిన వెర్రివేషాలు
బూతుపురాణాలు తిట్ల వడగళ్లు
వ్యభిచార రాకెట్లు డ్రగ్స్ మాఫియాలు
అకాలం కౌగిట్లో ‘మనిషి’ శిలాజాలు
అసహన జ్వాలలు అశాంతి మంటలు
యుద్ధం! యుద్ధం! విధ్వంసం!
అగులు బుగులుపుట్టి ఆగమయ్యి
అంగళ్ళ చెరల్లో ఆక్రోశిస్తూ
గాయాలను తడుముకుంటూ అడుగుతున్నా
ఏది బాగుంది ఈ లోకంలో
ఎవరు బాగున్నారని దేశంలో?
ఈ వార్తలు కూడా చదవండి
Kakani Police Notice: విచారణకు కాకాణి డుమ్మా.. రావాల్సిందే అన్న పోలీసులు
Lokesh On Visakhapatnam: ఏపీ ఐకానిక్ క్యాపిటల్‌గా విశాఖ
Kethireddy: ప్రైవేట్ జెట్ నడిపిన కేతిరెడ్డి.. వీడియో వైరల్
Read Latest AP News And Telugu News
– అనిశెట్టి రజిత