కాంతారావు పేరిట నంది అవార్డు
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:45 AM
నల్లగొండ జిల్లా, కోదాడలోని గుడిబండ గ్రామంలో 1925, నవంబర్ 15న జన్మించారు కాంతారావు. శతజయంతి ఉత్సవాల తరుణంలో ఆయన పేరుపై నంది అవార్డు ఇవ్వడం సముచితంగా ఉంటుంది. ఆయన 250కి పైగా...

నల్లగొండ జిల్లా, కోదాడలోని గుడిబండ గ్రామంలో 1925, నవంబర్ 15న జన్మించారు కాంతారావు. శతజయంతి ఉత్సవాల తరుణంలో ఆయన పేరుపై నంది అవార్డు ఇవ్వడం సముచితంగా ఉంటుంది. ఆయన 250కి పైగా చిత్రాల నటుడు, జానపద కథా నాయకుడు, కత్తివీరుడు, ఎన్టీఆర్–ఏయన్నార్‌లతో సమానంగా నటించి, పారితోషికం తీసుకున్నవాడు, బహుముఖ ప్రజ్ఞాశాలి.
చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తల్లితో కలిసి ఖమ్మం చేరుకున్నాడు. అక్కడే హైస్కూల్ వరకు చదువుకున్నాడు. అప్పట్లోనే నాటకాలు వేయడం ఆరంభించాడు. అప్పుడే సురభి వాళ్లు కాంతారావును తమ సంస్థలోకి ఆహ్వానించారు. ఆయనతో కృష్ణుడు, రాముడు, అర్జునుడు, నారదుడు వంటి పాత్రలు వేయించారు. దీంతో ఆయనలో కళాతృష్ణ పెరిగింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఆయన నాటకాలు వేస్తూ తిరిగారు. ఆ తరువాత సొంతంగా నాటక సంస్థను స్థాపించి నాటకాలు వేశారు. 1950లో మద్రాసులో నాటకాలు వేస్తూ దర్శక, నిర్మాత హెచ్.ఎం. రెడ్డి కంట్లో పడ్డారు. చిన్న చిన్న పాత్రలు వేస్తూ 1953లో ‘ప్రతిజ్ఞ’ చిత్రంతో హీరో అయ్యారు. అప్పటి నుంచి పలు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు చేశారు. నారద పాత్రతో ప్రత్యేక స్థానం సంపాదించారు.
కాంతారావు తెలంగాణ బిడ్డ. ఆయనకు తగిన గుర్తింపు రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి బిరుదులూ ఇవ్వలేదు. గద్దర్ రెండు సినిమాలలో రెండు, మూడు పాటలు పాడారు, స్టేజిపై ఆడి పాడారు. కానీ గొప్ప నటుడు, విభిన్న పాత్రలు పోషించిన కాంతారావు పేరుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ఇవ్వడం సముచితంగా ఉంటుంది.
అందేపాక నరహరి
కనీస నిల్వ చార్జీలు తీసెయ్యాలి
ప్రస్తుతం సేవింగ్స్ అకౌంట్‌లో ఉన్న నగదుకు వచ్చే వడ్డీ కన్నా వివిధ రకాల చార్జీల పేరుతో బ్యాంకులు తీసుకునే మొత్తం అధికంగా ఉంటోంది. అలాగే నగదు తీయాలన్నా వేయాలన్నా కూడా చార్జీలు వేస్తున్నారు. ఇప్పుడు ఖాతాలో కనీస నిల్వ ఐదువేల రూపాయలు ఉండాలంటున్నారు. లేకపోతే జరిమానా వేస్తారట. ఇది అన్ని రకాలుగా ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తున్నది. ప్రజల డబ్బును బ్యాంకులు సేవింగ్స్ రూపంలో తీసుకుని ఖాతాదారులకు అతి తక్కువ వడ్డీ ఇచ్చి, అధిక వడ్డీలకి పెట్టుబడిదారులకు ఇస్తూ మనుగడ సాగిస్తున్నాయి. కాబట్టి కనీస నిల్వ లేకపోతే చార్జీలు విధించడాన్ని బ్యాంకులు మానుకోవాలి.
నార్నె వెంకటసుబ్బయ్య
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News