Share News

Earthquake: థాయ్‌లాండ్, మయన్మార్‌లో భూకంపం.. అంతకంతకు పెరుగుతోన్న మృతులు

ABN , Publish Date - Mar 28 , 2025 | 09:50 PM

Earthquake: నిమిషాల వ్యవధిలో థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లలో భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పుకూలాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆ క్రమంలో మయన్మార్‌లో మృతుల సంఖ్య 144కి చేరగా.. థాయ్‌లాండ్‌లో తొమ్మిదికి చేరింది.

Earthquake: థాయ్‌లాండ్, మయన్మార్‌లో భూకంపం.. అంతకంతకు పెరుగుతోన్న మృతులు

బ్యాంకాక్/ మయన్మార్, మార్చి 28: కొన్ని నిమిషాల వ్యవధిలోనే మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాల్లో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య 153కి చేరింది.మయన్మార్‌లో మృతుల సంఖ్య 144కి చేరుకోగా.. థాయ్‌లాండ్‌లో మరణించిన వారి సంఖ్య 9కి చేరింది. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఈ భూకంపం కారణంగా దాదాపు 800 మందికిపైగా గాయపడ్డారు. వారికి చికిత్స కోసం వివిధ ఆసుపత్రులకు తరలించారు. వారి రోదనలతో ఆసుపత్రులు నిండిపోయాయి. అలాగే వివిధ భవంతుల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఇరు దేశాధినేతలు ఆయా దేశాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు.


మయన్మార్‌లో శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదయింది. ఇక నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో అందులో ఎనిమిది మంది మరణించారు. మరో 117 మంది ఆ భవంతిలో చిక్కుకున్నారు.వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు భూకంప ధాటికి పలు భవనాలు కుప్ప కూలి పోవడంతో.. రహదారులన్నీ దాదాపుగా శిథిలాలతో నిండిపోయాయి. దీంతో సహాయక చర్యలు కొనసాగేందుకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.


ఘోర విపత్తు నేపథ్యంలో తమకు సహాయ సహకారాలు అందించాలని మయన్మార్ మిలటరీ జనరల్ ప్రపంచ దేశాలకు విజ్జప్తి చేశారు. ఇక ఈ దేశంలో భూంకంపం సంభవించిన ప్రాంతాన్ని యఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. మయన్మార్‌లోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన మండలెలో ఈ భూకంపం సంభవించిందని గుర్తించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

Ugadi: ఉగాది.. మీ రాశిఫలాలు

Ugadi: ఉగాది నుంచి ఈ రాశుల వారికి సూపర్

LRS Number: ఎల్ఆర్ఎస్ నంబర్ మరిచిపోయారా..

Nirmala Sitaraman: మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం.. నిర్మలమ్మ సంచలన వ్యాఖ్యలు

Chain Smoking: చైన్ స్మోకింగ్ మానేయాలంటే.. ఇలా చేయండి..

Actress VishnuPriya: నటి విష్ణు ప్రియకు హైకోర్టులో ఎదురు దెబ్బ

Updated Date - Mar 28 , 2025 | 09:50 PM