WWE: జాన్ సెనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్.. ఇద్దరిలో ఎవరు రిచ్..
ABN , Publish Date - Mar 21 , 2025 | 06:46 PM
జాన్ సెనా, ర్యాండీ ఆర్టన్‌లు దాదాపు 25 ఏళ్ల నుంచి డబ్ల్యూడబ్ల్యూఈలో కొనసాగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ పక్కన పెడితే.. ఆస్తి పరంగా వీరిలో ఎవరు రిచ్...

డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఇప్పటి పిల్లలకు అంతగా తెలియకపోవచ్చు గానీ, 90 కిడ్స్‌కు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కేవలం పిల్లలే కాదు, పెద్దలు కూడా ఈ షో చూడ్డానికి తెగ ఆసక్తి చూపించేవారు. రింగ్ మధ్యలో ఇద్దరు ఫైటర్లు కొట్టుకుంటుంటే చూస్తూ భలే ఎంజాయ్ చేసేవారు. డబ్ల్యూడబ్ల్యూఈకి సంబంధించి అప్పట్లో ప్లేయింగ్ కాడ్స్ కూడా ఉండేవి. వాటితో బాగా టైమ్ పాస్ అయ్యేది. డబ్ల్యూడబ్ల్యూఈలో సూపర్ స్టార్లంటే ది గ్రేట్ ఖలీ, అండర్ టేకర్, కేన్, ది రాక్, బిగ్ షో, జాన్ సిన, ర్యాండీ ఆర్టన్, మార్క్ హెన్రీ, బటిష్ట, ఎడ్జ్‌ల పేర్లు గుర్తొస్తాయి. అప్పట్లో వీరి మధ్యే ప్రధాన పోటీ ఉండేది. ఇప్పుడు వీరిలో చాలా మంది గేమ్ మానేశారు. జాన్ సెనా, ర్యాండీ ఆర్టన్‌లు ఇంకా కొనసాగుతున్నారు. కొద్దిరోజుల క్రితం బ్యాక్‌లాస్ ఈవెంట్లో వీరిద్దరూ తలపడ్డారు కూడా. డబ్ల్యూడబ్ల్యూఈ సంగతి పక్కన పెడితే.. ఆస్తుల పరంగా వీరిద్దరిలో ఎవరు రిచ్?..
జాన్ సెనా ఆస్తి విలువ
జాన్ సెనా 2001లో డబ్ల్యూడబ్ల్యూఈలో ఎంటర్ అయ్యాడు. ఇప్పటి వరకు దాదాపు 16 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచాడు. డబ్ల్యూడబ్ల్యూఈలోకి రాకముందే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. 2000 సంవత్సరంలో విడుదల అయిన ’రెడీ టు రంబుల్‘ అనే సినిమాలో చిన్న పాత్ర చేశాడు. డబ్ల్యూడబ్ల్యూఈలోకి వచ్చిన తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ సినిమాలు చేయటం మొదలెట్టాడు. 2006లో వచ్చిన ’ది మెరైన్’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు 30కిపైగా సినిమాలు చేశాడు. ఓ వైపు డబ్ల్యూడబ్ల్యూఈ.. మరో వైపు సినిమాలు జాన్ సెనా బానే సంపాదించాడు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 80 మిలియన్ డాలర్లుగా తెలుస్తోంది. అది మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 688 కోట్ల రూపాయలు.
ర్యాండీ ఆర్టన్ ఆస్తి విలువ
ర్యాండీ ఆర్టన్ 2000 సంవత్సరంలో డబ్ల్యూడబ్ల్యూఈలోకి అడుగు పెట్టాడు. ర్యాండీ తండ్రి, తాత కూడా రెస్ల్రర్లే. 24 ఏళ్లకే డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలిచి రికార్డు సృష్టించాడు. 2000 నుంచి ఇప్పటి వరకు డబ్ల్యూడబ్ల్యూఈలో కొనసాగుతూనే ఉన్నాడు. 2004లో బుల్లితెరపై అడుగుపెట్టాడు. జిమ్మి కిమ్మల్ లైవ్‌లో కనిపించాడు. 2011లో ‘ దట్స్ వాట్ ఐయామ్’ అనే సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టాడు. 2019 వరకు 5 సినిమాల్లో నటించాడు. 2024లో ఓ మ్యూజిక్ వీడియో కూడా విడుదల చేశాడు. ర్యాండీకి ఎక్కువ ఆదాయం డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపించటం ద్వారా యాడ్లు చేయటం ద్వారానే వస్తుంది. అతడి మొత్తం ఆస్తి విలువ చూసుకుంటే.. 15 మిలియన్ డాలర్లు. అదే మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకుంటే దాదాపుగా 129 కోట్ల రూపాయలు. ఆస్తి ప్రకారం చూసుకుంటే ర్యాండీ ఆర్టన్ కంటే జాన్ సెనా చాలా రిచ్.
ఇవి కూడా చదవండి:
Finland: ఫిన్లాండ్.. సంతోషాల చిరునామా
Bader Khan Soori: అమెరికా అధికారుల అదుపులో భారత పరిశోధకుడు బదర్‌ఖాన్ సూరి
Trump Decision: అమెరికా విద్యాశాఖ మూసివేత!