Share News

Heathrow Airport, Fire: లండన్‌లో ఎయిర్‌పోర్టు రోజంతా మూసివేత

ABN , Publish Date - Mar 22 , 2025 | 06:11 AM

ఫలితంగా శుక్రవారం రోజంతా ఎయిర్‌పోర్టును మూసేశారు. ఈ ప్రభావం దాదాపు 1,350 విమాన సర్వీసులపై పడింది. లక్ష మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Heathrow Airport, Fire: లండన్‌లో ఎయిర్‌పోర్టు రోజంతా మూసివేత

లండన్‌, మార్చి 21: లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి విద్యుత్తు సరఫరా చేసే ఎలక్ట్రిక్‌ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో, ఎయిర్‌పోర్టుకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా శుక్రవారం రోజంతా ఎయిర్‌పోర్టును మూసేశారు. ఈ ప్రభావం దాదాపు 1,350 విమాన సర్వీసులపై పడింది. లక్ష మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి ప్రమాదం జరగ్గా.. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎయిర్‌పోర్టును మూసివేశారు. ఈ ప్రకటన సమయంలో దాదాపు 120 విమానాలు ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా వెంటనే వాటిని దారి మళ్లించారు. ఎయిర్‌ ఇండియా కూడా రెండు విమానాలను దారిమళ్లించింది. మరోవైపు, లండన్‌ నుంచి శంషాబాద్‌ రావాల్సిన బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం రద్దైంది.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 06:11 AM