Share News

Vatican City: ఆందోళనకరంగా పోప్ ప్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి.. వైద్యులు ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Feb 19 , 2025 | 12:58 PM

2013లో కాథలిక్ చర్చి అధిపతిగా ఉన్న పోప్ ప్రాన్సిస్ ప్రార్థనల సమయంలో బైబిల్ చదివేందుకు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అలాగే 2021 నుంచి హెర్నియా, పెద్దుపేగు శస్త్రచికిత్స చేయించుకున్న పోప్.. మోకాలి నొప్పి కారణంగా వీల్‌చైర్‌కు పరిమితం అయ్యారు.

Vatican City: ఆందోళనకరంగా పోప్ ప్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి.. వైద్యులు ఏం చెప్పారంటే..
Pope Francis

వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్(88) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆయనకు యాంటీబయోటిక్ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల్లో న్యుమోనియా సమస్యతో పోప్ పోరాతున్నట్లు ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. బ్రోన్కైటిస్ కారణంగా ఫ్రాన్సిస్ గత శుక్రవారం రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో పోప్ చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు వైద్యులు కృషి చేస్తూనే ఉన్నారు.


అయితే ఆయనకు జ్వరం తగ్గిందని, ఆహారం సైతం తీసుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు శనివారం తెలిపాయి. మళ్లీ పరిస్థితి క్లిష్టంగా మారినట్లు మంగళవారం నాడు వాటికన్ ఓ ప్రకటన జారీ చేసింది. అందుకే ఆదివారం ప్రార్థనలు సహా ఆయన పాల్గొనే అన్నీ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. పోప్ ప్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు వాటికన్ వెల్లడించింది. పోప్ ఆస్పత్రిలో ఐదో రోజున ప్రార్థనలు చేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా, గతంలోనూ పలుమార్లు పోప్ ప్రాన్సిస్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు.


2013లో కాథలిక్ చర్చి అధిపతిగా ఉన్న పోప్ ప్రాన్సిస్ ప్రార్థనల సమయంలో బైబిల్ చదివేందుకు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అలాగే 2021 నుంచి హెర్నియా, పెద్దుపేగు శస్త్రచికిత్స చేయించుకున్న పోప్.. మోకాలి నొప్పి కారణంగా వీల్‌చైర్‌కు పరిమితం అయ్యారు. కాగా, పోప్ ప్రాన్సిస్‌కు 21 సంవత్సరాల వయసులో ప్లూరిసి అనే వ్యాధి వచ్చి దాదాపు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన కుడి ఊపిరితిత్తులో కొంత భాగాన్ని డాక్టర్లు కత్తిరించి వైద్యం చేసి బతికించడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీ నూతన సీఎంపై స్పష్టత..

దుర్గగుడిలో ఉద్యోగుల అంతర్గత బదిలీల్లో మాయాజాలం

Updated Date - Feb 19 , 2025 | 12:58 PM