Pak Army Chief Faces Rebellion: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తిరుగుబాటు
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:34 AM
తిరుగుబాట్లతో.. ప్రభుత్వాలనే మార్చిన చరిత్ర ఉన్న పాక్ ఆర్మీలో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది.

ఇస్లామాబాద్, మార్చి 26: తిరుగుబాట్లతో.. ప్రభుత్వాలనే మార్చిన చరిత్ర ఉన్న పాక్ ఆర్మీలో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. జవాన్ మొదలు, కెప్టెన్, మేజర్, కల్నల్ ర్యాంకు అధికారులు తమ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ‘‘ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రాజీనామా చేయాల్సిందే’’ అంటూ అల్టిమేటం జారీచేశారు. ఆసిమ్ వైఫల్యాలను ఒక్కొక్కటిగా పేర్కొంటూ.. ఓ లేఖ రాశారు. ఆయన హయాంలో పాక్ సైన్యం పరిస్థితి 1971లకు వెళ్లిపోయిందని వాపోయారు. 1971లో జరిగిన యుద్ధంతో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన విషయం తెలిసిందే..! ఒకవేళ ఆసిమ్ రాజీనామా చేయకుంటే.. తామే చర్యలకు ఉపక్రమించాల్సి వస్తుందని, సైన్యాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని వారు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu New