Russia Ukraine Halt Military Actions: నల్ల సముద్రంలో సైనిక చర్యల నిలిపివేత
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:29 AM
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నల్ల సముద్రం ప్రాంతంలో పరస్పరం సైనిక చర్యలు నిలిపి వేసేందుకు రష్యా-ఉక్రెయిన్ అంగీకరించాయి.

రష్యా-ఉక్రెయిన్ అంగీకరించాయన్న అమెరికా
వాషింగ్టన్, మార్చి26: కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నల్ల సముద్రం ప్రాంతంలో పరస్పరం సైనిక చర్యలు నిలిపి వేసేందుకు రష్యా-ఉక్రెయిన్ అంగీకరించాయి. నల్ల సముద్రంలో నౌకలపై పరస్పరం దాడికి పాల్పడరాదని రెండు దేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్ష భవనం కార్యాలయం వైట్‌హౌస్ తెలిపింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అమెరికా-రష్యా అధికారుల మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. అంతేకాదు ఇంధన మౌలిక వసతులపై కూడా దాడులకు పాల్పడరాదని రష్యా-ఉక్రెయిన్ అంగీకరించాయని శ్వేతసౌధం తెలిపింది. శాశ్వత శాంతి కోసం యత్నాలు కొనసాగించేందుకు, పరస్పరం యుద్ధ ఖైదీల అప్పగింత, పౌరుల విడుదలకు రెండు దేశాలు అంగీకరించాయని తెలిపింది. మరోవైపు నల్ల సముద్రం తీరప్రాంత భద్రతపై ఒప్పందానికి రష్యా అంగీకరించినందుకు ప్రపంచ మార్కెట్‌లోకి ఆ దేశ ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం సహకరిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య కుదిరిన నల్ల సముద్ర తీరప్రాంత రక్షణ ఒప్పందం వల్ల భారత్ సహా పలు దేశాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, ఆర్ధిక సుస్ధిరతకు మార్గం ఏర్పడుతుంది. నల్ల సముద్రం గుండా ఆహార ధాన్యాలు, ఎరువులను సురక్షితంగా ఎగుమతి చేయగలుగుతారు.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu New