Sub Registrar office: సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో నేటి నుంచి స్లాట్ బుకింగ్
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:03 AM
ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి డిజిటల్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీక్యూఎంఎస్) ను అమలు చేసింది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా కార్యాలయాలలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేయనుంది

డిజిటల్ క్యూను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
అమరావతి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్ అవసరాల కోసం గంటల తరబడి ఎదురుచూసే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇప్పటివరకు పైలట్‌గా అమలైన కార్యక్రమం పట్టాలెక్కింది. ఇక నుంచి ముందుగా స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి కార్యాలయానికి వెళ్తే చాలు.. రిజిస్ర్టేషన్ పూర్తయ్యేలా ప్రభుత్వం కొత్తగా డిజిటల్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్(డీక్యూఎంఎ్‌స)ను అమల్లోకి తెచ్చింది. రెవెన్యూ, రిజిస్ర్టేషన్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ శుక్రవారం సచివాలయం నుంచి ఈ సేవలను ప్రారంభిస్తారు. మార్చి 10 నుంచి కృష్ణా జిల్లా కంకిపాడు సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలో డీక్యూఎంఎస్ సేవలను పైలట్‌గా అమలు చేస్తున్నారు.
స్లాట్ బుకింగ్.. ప్రయోజనాలు ఇలా..!
పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) సిస్టమ్ ద్వారా, రిజిస్ర్టేషన్ల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోని స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా, అన్ని సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ వల్ల సమయం ఆదా అవుతుంది. అనధికారిక కార్యకలాపాలు, నకిలీ రిజిస్ర్టేషన్లు తగ్గుతాయి. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరాలు తగ్గుతాయి. ఏప్రిల్ 4నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రధాన సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకూ ఈ స్లాట్ బుకింగ్ వ్యవస్థను విస్తరిస్తామని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News