-
-
Home » Mukhyaamshalu » Today Breaking News Live Updates in Telugu News Saturday 8th March 2025 Siva
-

Breaking News: నంద్యాలలో రైలు ప్రమాదం..
ABN , First Publish Date - Mar 09 , 2025 | 08:51 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-09T13:55:17+05:30
నంద్యాలలో రైలు ప్రమాదం..
నంద్యాల : గాజులపల్లె దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.
పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం.
యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన అధికారులు.
-
2025-03-09T13:07:52+05:30
అసెంబ్లీకి కేసీఆర్..
ఈనెల 12నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్.
బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయం.
ఈనేపధ్యంలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించనున్న కేసీఆర్.
కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మంగళవారం మధ్యహానం 1గంలకు సమావేశం.
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామంటోన్న బీఆర్ఎస్ అధినేత.
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ ను ఎండగడుతామంటోన్న మాజీ సీఎం.
-
2025-03-09T12:55:20+05:30
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికపై తెగని ఉత్కంఠ..
అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికపై తెగని ఉత్కంఠ..
5 స్థానాలకు గాను జనసేన నుంచి నాగేంద్ర బాబు పేరు ఖరారు.
తెలుగు దేశం నుంచి అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి కసరత్తు.
టీడీపీ నుంచి నలుగురికి అవకాశం.
తీవ్ర స్థాయిలో ప్రయత్నాల్లో 10 మంది పైగా నేతలు.
నామినేషన్లకు సోమవారం చివరి తేదీ.
ఈ రోజు సాయంత్రంలోగా లిస్ట్ విడుదల అయ్యే అవకాశం.
విజయవాడలో మొహరించిన ఆశావహులు.
మరోవైపు ఎవరినీ కలవకుండా చంద్రబాబు కసరత్తు.
మరో రెండు మూడు గంటల్లో ఉత్కంఠకు తెరపడే అవకాశం.
అభ్యర్థులతో పాటు తమ నాయకులకు అవకాశం ఉంటుందా లేదా అనే సస్పెన్స్‌లో అనుచరులు.
-
2025-03-09T10:02:13+05:30
ఉపరాష్ట్రపతికి స్వల్ప అస్వస్థత
ఢిల్లీ: స్వల్ప అస్వస్థతకు గురైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్.
ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని కార్డియాక్ విభాగంలో చేరిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న ఎయిమ్స్ వైద్యులు.
-
2025-03-09T08:51:07+05:30
కామారెడ్డి: దోమకొండ మండలం సీతారాంపల్లిలో దారుణం
రాధిక (28) అనే వివాహిత విద్యుత్ షాక్ తో మృతి.
తన బైక్ నుంచి పెట్రోల్ దొంగిలిస్తున్నారని బైక్ కు విద్యుత్ షాక్ పెట్టిన భర్త రాజనర్సు
విషయం తెలియక బైక్ ను ముట్టుకున్న భార్య రాధిక.
షాక్ తగిలి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి