Mosquito control : ఆడ దోమల అంతానికి.. మగ దోమల్లో విష జన్యువు
ABN , Publish Date - Jan 09 , 2025 | 05:52 AM
రాజును చంపడానికి విలన్ విషకన్యని ప్రయోగించే కథ చాలా సినిమాల్లో చూశాం. అదే టెక్నిక్‌తో.. ఆడ దోమలను అంతం చేసేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ‘టాక్సిక్ మేల్ టెక్నిక్’ పేరుతో
వాటి వీర్యం విషపూరితమయ్యేలా జన్యుమార్పిడి
వాటితో కలిసిన ఆడదోమల జీవితకాలం 60ు
తగ్గినట్టు గుర్తించామన్న ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు
సిడ్నీ, జనవరి 8: రాజును చంపడానికి విలన్ విషకన్యని ప్రయోగించే కథ చాలా సినిమాల్లో చూశాం. అదే టెక్నిక్‌తో.. ఆడ దోమలను అంతం చేసేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ‘టాక్సిక్ మేల్ టెక్నిక్’ పేరుతో ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా.. మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేసే జన్యువును వాటిలో ప్రవేశపెడుతున్నారు. ఆ విషపూరిత దోమలు ఆడదోమలతో కలిసినప్పుడు.. వాటి వీర్యంలో ఉండే విష ప్రొటీన్లు సదరు ఆడదోమల ఆరోగ్యం క్రమంగా క్షీణించిపోయేలా చేసి చివరికి వాటిని చంపేస్తుందన్నమాట. ఏటా దోమ కాటు కారణంగా ప్రపంచవ్యాప్తంగా 39 కోట్ల మంది డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి జ్వరాల బారిన పడుతున్నారు. ఈ వ్యాధులు ఆడదోమల వల్లే వ్యాపిస్తాయి. దీంతో ఆడ దోమలను చంపేందుకు ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇలా జన్యుమార్పుడి చేసిన మగదోమలతో కలిసిన ఆడదోమల జీవితకాలం 60 శాతం మేర తగ్గిపోతున్నట్టు గుర్తించామని వారు వెల్లడించారు. ఆడదోమల జీవితకాలం 60ు తగ్గినా.. దోమకాటు బాధితుల సంఖ్య తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.