Kerala Horror Crime : పగిలిపోయిన పుర్రెలు, విరిగిపోయిన మణికట్టు.. ఆ 5 హత్యల వెనుక ఉన్నది ఎవరు?
ABN , Publish Date - Feb 26 , 2025 | 07:05 PM
Kerala Horror Crime : తిరువనంతపురంలో ఓకే రాత్రిలో 5 హత్యల కేసు సంచలనం రేపుతోంది. నరరూపరాక్షసుడిలా మూడు కుటుంబాలను వెంటాడి వేటాడి నరికి చంపాడు ఓ వ్యక్తి. తర్వాతి రోజున ఏ మాత్రం జంకు గొంకు లేకుండా తాపీగా పోలీసులకు లొంగిపోయాడు. ఎందుకిలా చేశాడు. అసలా రాత్రి ఏం జరిగింది. ఈ హత్యల వెనక ఉన్న కారణమేంటి?

Kerala Horror Crime : ఒకే రాత్రిలో ఐదు హత్యలు జరిగాయి. ఈ హత్యలు చేసింది తానే అంటూ ఆఫాన్ అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. అయితే, అతని కదలికల్లో ఎక్కడా భయం లేదు, టెన్షన్ లేదు. ఒక నరహంతకుడిలా అతడు ఎలా ఒకే రాత్రి వరసపెట్టి ఇన్ని హత్యలు చేశాడు? ఈ హత్యల వెనకగల అసలు కారణం ఏంటి అనేది తెలియక పోలీసులు తలపట్టుకుంటున్నారు. నిజంగా ఇది ఆర్థిక సమస్యా లేదా డ్ర*గ్స్ ప్రభావమా అనే యాంగిల్‌లో దర్యాప్తు కొనసాగుతోంది.
మూడు ఇళ్లలో ఒకే రాత్రిలో హత్యలు..
తిరువనంతపురంలోని మూడు ఇళ్లలో హత్యలు జరిగాయి. ఒక్క ఇంట్లో పొలాల్లో పని చేసి వచ్చిన సల్మా బీవి (అమ్మమ్మ), రాత్రి భోజనం చేసి విశ్రాంతిగా మంచంపై పడుకున్నది. కానీ తెల్లవారేసరికి ఆమె శరీరాన్ని మృత్యువు కమ్మేసింది. రక్తంతో నిండిన దుస్తులు, విరిగిపడ్డ నడుం ఎముక, గట్టిగా దెబ్బతిన్న తల.. పోలీసులు ఆమెను చూసినప్పుడే, హత్య ఎంత భయంకరంగా జరిగిందో అర్థమైంది.
రెండో ఇంట్లో ఆఫాన్ మామ లతీఫ్, ఆయన భార్య షాహిదా. ఆ రాత్రి వాళ్లు నిద్రలోకి జారుకున్నారు. కానీ రాత్రి చివరిసారి ఊపిరి పీల్చుకుంటున్నారనుకున్నారా? రక్తం మరకలు పడిన మంచం, నేలమీద పడిపోయిన విరిగిన ఎముకలు..! హత్యకు వాడిన ఆయుధం ఎంత దారుణంగా వాడిందో అక్కడి పరిస్థితిని చూస్తేనే అర్థమైంది.
మూడో ఇంట్లో తన తల్లిని హత్య చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె ప్రాణాలతో బయటపడింది. అతని చిన్న తమ్ముడు..13 ఏళ్ల అహసన్ మాత్రం హింసకు గురై చనిపోయాడు. పోలీసులు వచ్చేసరికి మూడు ఇళ్లలో ఐదు శవాలు కనిపించాయి.
దారుణంగా హతమార్చింది దీంతోనే..
ఆఫాన్ కత్తి లేదా మరో పదునైన ఆయుధాన్ని వాడి ఉండొచ్చని పోలీసుల మొదటగా భావించారు. కానీ, కొద్దిసేపటి తర్వాత అసలు మిస్టరీ బయటపడింది. హత్యలు జరిగిన ప్రతీ చోటా ఒకే విధమైన గాయాలు. తలలు నుజ్జునుజ్జయ్యేలా దెబ్బలు. పగిలిపోయిన పుర్రెలు. మణికట్టులు విరిగిపోవడం. ఈ హత్యలన్నీ సుత్తి తో జరిగాయన్న అనుమానం వచ్చేసింది. ఒకే ఒక వ్యక్తి ఐదుగురిని ఇంతదారుణంగా హత్య చేయడం సాధ్యమేనా? లేక అతనికి ఎవరి సహకారమైనా ఉందా?
ఇదే అసలు కారణమా..
నిజానికి ఆఫాన్ కుటుంబం 64 లక్షల రూపాయల అప్పులో కూరుకుపోయింది. అతని తండ్రి సౌదీలో ఉన్నాడని, అక్కడే చిక్కుకుపోయాడని తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. కానీ, ఇది హత్యలకు అసలు కారణమా? పోలీసులకు మరో కోణం అనుమానంగా మారింది. ఆఫాన్ డ్రగ్స్ తీసుకునేవాడా? ఆ రాత్రి అతను మత్తులో ఉన్నాడా? అతని నడవడికలో మత్తు ధోరణి ఉందా? అతని రక్త పరీక్షలు ఇంకా రాలేదు. పోలీసులు డ్రగ్స్ యాంగిల్‌లో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : చేపతో వింత వీడియో.. బెడిసికొట్టిన ప్రయోగం.. ఇదేం పనంటూ..
CM Revanth Met PM Modi : సీఎంకు పెద్ద లిస్ట్ ఇచ్చిన పీఎం.. అందులో ఏముందంటే..
Donald Trump Gold Card : ట్రంప్ గోల్డ్ కార్డ్ ఆఫర్.. డబ్బు చెల్లిస్తే ఎవరికైనా అమెరికా పౌరసత్వం..