Share News

Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డి కేసుల విచారణపై సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 10:01 PM

Gali Janardhan Reddy: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి కేసుల విచారణపై సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని, ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని న్యాయస్థానం నిందితులుగా పేర్కొంది.

Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డి కేసుల విచారణపై సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు
Gali Janardhan Reddy

ఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన ఓఎంసీ కేసును ఇవాళ(శుక్రవారం) సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఓఎంసీ కేసులో తీర్పును సీబీఐ కోర్టు వెల్లడించనుంది. ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టు ట్రయల్ పూర్తిచేసింది. మే 6వ తేదీన తుది తీర్పును సీబీఐ కోర్ట్ వెల్లడించనుంది. ఓఎంసీ కేసులో 2011లో గాలి జనార్దన్ రెడ్డి సోదరులపైన కేసు నమోదైన విషయం తెలిసిందే.


13 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది. ఓఎంసీ కేసుపై నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెల్లడించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని, ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని న్యాయస్థానం నిందితులుగా పేర్కొంది. ఇదే కేసులో మరో ఐదుగురు నిందితులను చేర్చింది . మొత్తం ఏడుమంది నిందితులపై న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Myanmar And Thailand: బ్యాంకాక్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న తెలుగు ఎమ్మెల్యే కుటుంబం

Vijay: 2026 ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యనే పోటీ.. స్టాలిన్, మోదీపై విజయ్ నిప్పులు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2025 | 10:06 PM