Delhi High Court: ఖాళీగా ఉంటూ మనోవర్తి కోరలేరు
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:56 AM
మనోవర్తి అన్నది భద్రత, సమానత్వం కలిగించడానికి ఉద్దేశించిందే తప్ప ఖాళీగా కూర్చోమని చెప్పేదికాదని పేర్కొంది. ఓ జంటకు 2019 డిసెంబరులో వివాహం జరిగింది. అనంతరం సింగపూర్‌లో నివసించడం ప్రారంభించింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య 2021 ఫిబ్రవరిలో తిరిగి వచ్చేసింది. 2021 జూన్ నుంచి మేనమామ ఇంట్లో ఉంటోంది.

ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మార్చి 20: అన్ని విద్యార్హతలు కలిగి, సంపాదించే సామర్థ్యం ఉండే మహిళ ఖాళీగా ఉంటూ భర్త నుంచి మధ్యంతర భృతి కోరలేదని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. మనోవర్తి అన్నది భద్రత, సమానత్వం కలిగించడానికి ఉద్దేశించిందే తప్ప ఖాళీగా కూర్చోమని చెప్పేదికాదని పేర్కొంది. ఓ జంటకు 2019 డిసెంబరులో వివాహం జరిగింది. అనంతరం సింగపూర్‌లో నివసించడం ప్రారంభించింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య 2021 ఫిబ్రవరిలో తిరిగి వచ్చేసింది. 2021 జూన్ నుంచి మేనమామ ఇంట్లో ఉంటోంది. పోషణ నిమిత్తం భర్త నుంచి మధ్యంతర మనోవర్తి ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఆమె ఉన్నత విద్యావంతురాలని, సంపాదించే సామర్థ్యం ఉందని భర్త తెలిపాడు. నిరుద్యోగిగా ఉన్నానన్న కారణం చూపి మనోవర్తి కోరలేదని పేర్కొన్నాడు. ఆమె ఆస్ట్రేలియాలో మాస్టర్ డిగ్రీ చేసిందని, పెళ్లికి ముందు దుబాయ్‌లో ఉద్యోగం కూడా చేసినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. భర్త వాదనతో ఏకీభవించిన కోర్టు మనోవర్తి మంజూరు చేసేందుకు నిరాకరించింది. తాను ఖాళీగా ఏమీ లేనని, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నానని అమె కోర్టుకు చెప్పగా, అందుకుతగ్గ ఆధారాలు చూపలేదని కోర్టు అభ్యంతరం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..