Share News

భర్త బంపరాఫర్: 'పిల్లలను నేను పెంచుతాను రాధిక.. నీ లవర్‌‌ని పెళ్లి చేసుకో'

ABN , Publish Date - Mar 27 , 2025 | 08:01 AM

భార్య మరొకరిని ప్రేమిస్తుంది అని తెలిస్తే... ఆమెని వదిలేస్తారు.. లేదంటే నయానో, భయానో మార్చుకుంటారు. ఇక కొందరైతే.. ఆ కారణం చూపి ఆమెను టార్చర్ చేస్తారు. మరీ కోపం వస్తే చంపేస్తారు. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే వ్యక్తి ఇందుకు పూర్తి విరుద్ధంగా చేశాడు. భార్య ప్రేమ గురించి తెలుసుకున్న ఆ వ్యక్తి.. నీ సుఖమే నే కోరుకున్నా అంటూ.. దగ్గరుండి మరి ఆమెకు ప్రేమించిన వాడితో వివాహం చేశాడు. అంతేకాక పిల్లలు నా బాధ్యత.. నేను ఒంటరిగానే వాళ్లని పెంచుతాను.. నువ్వు మాత్రం సంతోషంగా ఉండు అంటూ ఆశీర్వదించాడు.

భర్త బంపరాఫర్: 'పిల్లలను నేను పెంచుతాను రాధిక.. నీ లవర్‌‌ని పెళ్లి చేసుకో'
UP Love Marriage

మీకు కన్యాదానం సినిమా గుర్తుందా.. తన భార్య పెళ్లిరి ముందే మరో వ్యక్తిని ప్రేమించింది.. తల్లిదండ్రుల బలవంతం మేరకు తనను వివాహ చేసుకుంది అని తెలుసుకున్న హీరో.. ఆమె సంతోషం కోసం.. ప్రేమించిన వాడిని వెతికి తీసుకువచ్చి.. దగ్గరుండి మరీ తన భార్యకు తానే.. ఆమె ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపిస్తాడు. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. అప్పుడు ఈ మూవీ చూసిన వారంతా.. రియల్‌గా ఇలా అస్సలు జరగదు అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కన్యాదానం సినిమా కాన్సెప్ట్‌లు సమాజంలో రిపీట్ అవుతున్నాయి. భార్య మరొకరిని ప్రేమించింది అని తెలిసి.. దగ్గరుండి మరి వారికి పెళ్లి చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు కొందరు భర్తలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..


ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సంత్ కబీర్ నగర్‌కు చెందిన బబ్లూ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన రాధికకు 2017లో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. భార్యాబిడ్డల పోషణ నిమిత్తం.. బబ్లూ వేర్వేరు ప్రాంతాలకు పని కోసం వెళ్లేవాడు. ఈ క్రమంలో రాధికకు తన గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది.

దీని గురించి రాధిక అత్తమామాలకు తెలియడంతో వారు తమ కొడుకు బబ్లూకు ఈ విషయం చెప్పారు. భార్య గురించి భయంకరమైన నిజం తెలుసుకున్న బబ్లూ.. ఆమెని వదిలి వేయాలనుకోలేదు. ఆమెను మార్చుకోవాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ రాధికలో మార్పు తీసుకురాలేదు. ఇక చేసేదేం లేక.. భార్య వివాహేతర బంధం గురించి గ్రామ పెద్దలకు చెప్పాడు బబ్లూ. వారు మందలించినా రాధికలో మార్పు రాలేదు.


ఈ క్రమంలో బబ్లూ ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. భార్య రాధకను.. ఆమె ప్రేమించిన వాడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. రాధిక, ఆమె లవర్‌ను పిలిచి తన నిర్ణయం చెప్పాడు. అంతేకాక పిల్లల గురించి బాధపడవద్దని.. వారిని తాను చూసుకుంటానని తెలిపాడు. తమ ప్రేమకు భర్త అడ్డు చెప్తాడని భావిస్తే.. అందుకు భిన్నంగా అతడే దగ్గరుండి పెళ్లి చేస్తాననడంతో రాధిక సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఇక భర్త సమక్షంలో.. గ్రామంలోని ఓ ఆలయంలో ప్రేమించిన వాడిని వివాహం చేసుకుంది రాధిక. బబ్లూ దగ్గరుండి తన భార్య చేయిని.. ఆమె ప్రేమించిన వాడి చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని.. సంతోషంగా ఉండమని ఆశీర్వదించాడు. ఈ సంఘటన ఆ గ్రామంలో సంచలనంగా మారింది.


ఇవి కూడా చదవండి:

ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయారు.. కట్ చేస్తే 64 ఏళ్ల తర్వాత

చోరీ చేయడంలోనూ భార్యకు ట్రైనింగ్.. చివరకు ఇద్దరూ కలిసి..

Updated Date - Mar 27 , 2025 | 12:15 PM