Share News

IIT Guwahati: క్యాన్సర్‌కు హైడ్రోజెల్‌ చికిత్స

ABN , Publish Date - Jan 03 , 2025 | 06:20 AM

ఐఐటీ గువాహటికి చెందిన పరిశోధకులు క్యాన్సర్‌కు ఓ వినూత్న చికిత్సను అభివృద్ధిపరిచారు. క్యాన్సర్‌ సోకిన భాగంలోకి ఒక హైడ్రోజెల్‌ను పంపించటం ద్వారా ఈ చికిత్స అందిస్తారు.

IIT Guwahati: క్యాన్సర్‌కు హైడ్రోజెల్‌ చికిత్స

  • ఐఐటీ గువాహటి పరిశోధకుల ఆవిష్కరణ

  • ఎలుకల్లో ప్రయోగం విజయవంతం

న్యూఢిల్లీ, జనవరి 2: ఐఐటీ గువాహటికి చెందిన పరిశోధకులు క్యాన్సర్‌కు ఓ వినూత్న చికిత్సను అభివృద్ధిపరిచారు. క్యాన్సర్‌ సోకిన భాగంలోకి ఒక హైడ్రోజెల్‌ను పంపించటం ద్వారా ఈ చికిత్స అందిస్తారు. దీనివల్ల ప్రస్తుతం కీమోథెరపీ వంటి క్యాన్సర్‌ చికిత్సల కారణంగా తలెత్తే దుష్పరిణామాలు ఉండవని, ఇది సురక్షితమైనదని పరిశోధకులు వెల్లడించారు. కోల్‌కతాలోని బోస్‌ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి నిర్వహించిన ఈ పరిశోధన తాలూకు వివరాలు.. రాయల్‌ సొసైటీ కెమిస్ట్రీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఐఐటీ గువాహటి రసాయనశాస్త్రం విభాగానికి చెంది న ప్రొఫెసర్‌ దేబప్రతిమ్‌దాస్‌ ఈ పరిశోధన గురించి వెల్లడిస్తూ.. ‘అంతర్గత అవయవాలకు క్యాన్సర్‌ వచ్చినప్పుడు ఆ అవయవాలను శస్త్రచికిత్స చేసి తొలగించటం కుదరదు. అలాగే, కీమోథెరపీ వల్ల క్యాన్సర్‌ క ణాలతోపాటు ఆరోగ్య కణాలు కూడా దెబ్బతింటాయి.


వీటికి పరిష్కారంగా.. క్యాన్సర్‌ ఉన్న భాగంలోకి మా త్రమే ఔషధాన్ని తీసుకెళ్లే విధంగా హైడ్రోజెల్‌ను రూ పొందించాం. క్యాన్సర్‌ కణితి ఉన్న ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా హైడ్రోజెల్‌ నియంత్రిత విధానంలో ఔషధాన్ని విడుదల చేస్తుంది. అలా్ట్రషార్ట్‌ పెప్టైడ్స్‌తో రూపొందే హైడ్రోజెల్‌ జీవద్రవ్యాల్లో కరిగిపోకుండా స్థిరంగా నిలిచి ఉంటుంది కాబట్టి ఔషధాన్ని అందించటంలో ఎటువంటి అంతరాయం ఉండదు’ అని తెలిపారు. ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఎలుకల్లో రొమ్ము క్యాన్సర్‌కు ఈ చికిత్సను పరీక్షించగా.. 18 రోజుల్లోనే కణితి సైజు 75ు మేర తగ్గిపోయిందని దాస్‌ వెల్లడించారు. ఇతర రకాల క్యాన్సర్లలో కూడా ఈ చికిత్సను ఉపయోగించటంపై అధ్యయనం జరుపుతున్నామని, దాని తర్వాత క్లినికల్‌ ట్రయల్స్‌కు దరఖాస్తు చేసుకుంటామని ఆయన తెలిపారు.

Updated Date - Jan 03 , 2025 | 06:20 AM