పదివేల సోలార్ కనెక్షన్ల మంజూరు
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:41 PM
రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహి స్తోందని, ఇందులో భాగంగా నియోకవర్గానికి పదివేల సోలార్ కనెక్షన్లు మంజూరు చేస్తు న్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

సంతబొమ్మాళి, మార్చి31(ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహి స్తోందని, ఇందులో భాగంగా నియోకవర్గానికి పదివేల సోలార్ కనెక్షన్లు మంజూరు చేస్తు న్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవా రం సంతబొమ్మాళిలోసూర్యనారాయణ స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ సంతబొమ్మాళి నుంచి కోటబొమ్మాళి రహదారికి రెండురోజుల్లో శంకుస్థాపన చేస్తామన్నారు.పోలాకి నుంచి నౌప డ వరకు డీపీఎన్ రోడ్డు, నౌపడ నుంచి వెంకటాపురం వరకు రోడ్లకు 102 కోట్లు మం జూరుకావడంతో పనులు ప్రారంభిస్తామన్నారు. వడ్డివాడ, నౌపడ వద్ద రైల్వే వంతెనల నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యావని పనులు ప్రారంభవు తాయని చెప్పారు. ఆయన వెంట హరివరప్రసాద్, మాజీ సర్పంచ్‌లు కాంతారావు,మెండ అప్పారావు ఉన్నారు.
ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
కోటబొమ్మాళి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.సోమవారం కోటబొమ్మాళిలోని ఎన్టీఆర్ భవనంలో ముఖ్యమంత్రి సహాయనిధి రూ.14, 73, 550 లక్షల చెక్కులను 14 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, నాయకులు బోయిన రమేష్, తర్ర రామకృష్ణ, వెలమల కామేశ్వరరావు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేయాలి
ఉపాధ్యాయులపై ఉన్న కేసులు ఎత్తివేయాలని మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ఉన్నత అధికారులకు సూచించారు.కోటబొమ్మాళి టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించారు. కుప్పిలిలో జరిగిన పదోతరగతి పరీక్షలకు సంబంధించి డీఈవో అలజడి సృష్టించారని మంత్రికి ఉపాధ్యాయ సంఘాలు ప్రతినిధులు మురళీమోహన్, రాజారావు, శివరాంప్రసాద్ వివరించారు. ఉపాధ్యాయులపై సస్పెన్షన్, క్రిమినల్ కేసుల నుఎత్తివేయాలని కోరారు. దీంతో ఆయన అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాలు కల్పించాలని పలువురు యువత వినతిప త్రం అందజేశారు.
జాబ్‌మేళాను వినియోగించుకోండి
కోటబొమ్మాళి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జరిగే జాబ్ మేళాను నిరుద్యోగులు వినియోగించుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో కోరారు. ఏపీరాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోజరిగే జాబ్‌మేళాకు నియోజకవర్గంలో నిరుద్యోగులు సంబందిత విద్యా ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు.
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
టీడీపీ హయాంలో మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.ఈ మేరకు నిమ్మాడలోని కార్యాలయంనుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.రంజాన్ పురస్కరించుకొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు.