Share News

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:32 PM

వేసవి ఎండలు అధికం కావడంతో అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం
పేట మండలం లింగంపల్లి పత్తిమిల్లు వద్ద దగ్ధమైన దూదిని ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది (ఫైల్‌)

- వేసవిలో పొంచి ఉన్న ప్రమాదాలు

నారాయణపేట, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): వేసవి ఎండలు అధికం కావడంతో అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదాలు జరిగితే క్షణాల మీదుగా కళ్ల ఎదుటే అగ్నికి ఆహుతి అవుతు ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. మంటలను అదుపులోకి తెచ్చేం దుకు అగ్నిమాపక సిబ్బంది వాహనంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. జిల్లాలో 2024 నవంబరు 28న నారాయణపేట మండలం లింగంపల్లి పత్తిమిల్లులో అగ్నిప్రమాదం జరిగి పెద్దఎత్తున పత్తి అగ్నికి ఆహుతైంది. అధికంగా సీసీఐ కొనుగోలు చేసిన 13.15 వేల క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతై రూ.ఏడు కోట్లు నష్టం జరగగా ప్రైవేటు మిల్లుకు సంబంధించిన 1500 బెల్స్‌ దగ్ధమై రూ.నాలుగు కోట్ల నష్టం జరిగింది. నారాయణపేట, మక్తల్‌, ఆత్మకూర్‌, కొత్త కోటకు చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటల ను అదుపులోకి తెచ్చి దగ్ధమైన పత్తికుప్పల తెప్పలు తొలగించేందుకు 36 గంటల వరకు శ్రమించారు. గత ఏడాది మార్చి మూడో వారంలో మాగనూర్‌ మండలం వడ్వాట్‌ గ్రామ సమీపం లో ఉన్న జిన్నింగ్‌ కాటన్‌ మిల్లులో షార్ట్‌ స ర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగి పత్తి విత్తనాలు కాలిపోయి దాదాపు రూ.8 కోట్లు నష్టం వాటిల్లింది. జిల్లాలో అక్కడక్కడా చిన్నచిన్న అగ్ని ప్రమాదాలు గడివాములు దగ్ధం, రహదారుల గుండా హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతైన ఘటనలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Mar 31 , 2025 | 11:32 PM