Karnataka Power Tariff: కర్ణాటకలో ఏప్రిల్ నుంచి కరెంట్ చార్జీల పెంపు
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:50 AM
ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో ఏప్రిల్ ఆరంభం నుంచి చార్జీలు పెంచేందుకు కేఈఆర్‌సీ సిద్ధమైంది. శాసనసభ సమావేశాలు శుక్రవారం దాకా కొనసాగుతున్నందున, ఈ అంశంపై అధికారికంగా ప్రకటించకుండా జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది.

బెంగళూరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కరెంట్ చార్జీలను యూనిట్‌కు 36 పైసలు చొప్పున పెంచనున్నారు. కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (కేఈఆర్‌సీ) నుంచి రెండువారాల కిందటే ప్రభుత్వానికి చార్జీల పెంపు ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో ఏప్రిల్ ఆరంభం నుంచి చార్జీలు పెంచేందుకు కేఈఆర్‌సీ సిద్ధమైంది. శాసనసభ సమావేశాలు శుక్రవారం దాకా కొనసాగుతున్నందున, ఈ అంశంపై అధికారికంగా ప్రకటించకుండా జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వైద్యవిద్యాశాఖ మంత్రి శరణుప్రకాష్ పాటిల్ గురువారం విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ చార్జీలు పెరిగినా సామాన్యులపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. గృహజ్యోతి గ్యారెంటీ ద్వారా అందిస్తున్న ఇంటికి 200 యూనిట్‌ల ఉచితం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..