Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ ఉండదు
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:36 AM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ దేవాలయాల్లో విక్రయించే ప్రసాదాలపై జీఎస్టీ ఉండదని తెలిపారు. బడ్జెట్ 2025-26 ఆమోదం కోసం లోక్‌సభలో ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టిన ఆమె, డిజిటల్ పన్నును కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

న్యూఢిల్లీ, మార్చి 25: దేవాలయాల్లో, ఇతర ప్రార్థన మందిరాల్లో విక్రయించే ప్రసాదాలపై ఎలాంటి జీఎస్టీ ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆమె లోక్‌సభలో ‘ఆర్థిక బిల్లు-2025’పై ప్రసంగించారు. ప్రసాదంపై జీఎస్టీ ఉండదని, అదేవిధంగా ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్నును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 2017లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల్లోనూ ప్రసాదాలపై జీఎస్టీ ఉండదని, అయితే.. వాటి తయారీకి వినియోగించే ముడిపదార్థాలు-- పంచదార, నెయ్యి వంటి వాటిపై యథావిధిగా పన్ను ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే..! కాగా.. బడ్జెట్(ఆర్థిక బిల్లు-2025)ను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. రాజ్యసభ కూడా దీన్ని ఆమోదిస్తే.. 2025-26 బడ్జెట్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ