PM Modi: కార్యకర్త కోసం మధ్యలోనే ప్రసంగం ఆపిన మోదీ
ABN , Publish Date - Feb 08 , 2025 | 09:49 PM
ప్రధాని తన ప్రసంగం సాగిస్తుండగా ఒక కార్యకర్త ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించారు. వెంటనే తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి కార్యకర్తకు మంచినీరు అందించాలని అక్కడుకున్న వారికి సూచించారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గతంలో తన ప్రసంగాల సమయంలో ఎవరికైనా అసౌకర్యంగా ఉండే గమనించి వేదిక నుంచే సూచనలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం అనంతరం శనివారం సాయంత్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు విజయోత్సవ కార్యక్రమంలో సైతం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రధాని తన ప్రసంగం సాగిస్తుండగా ఒక కార్యకర్త ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించారు. వెంటనే తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి కార్యకర్తకు మంచినీరు అందించాలని అక్కడుకున్న వారికి సూచించారు.
PM Modie: ఢిల్లీ అభివృద్ధిని పరుగులు తీయిస్తా: మోదీ
''ఆయన మగతగా ఉన్నారా? ఆరోగ్యం బాగోలేదా? డాక్టర్... దయచేసి ఆయనను చెక్ చేయండి. అతనికి మంచినీరు అందజేయండి. ఆయన అసౌకర్యంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు'' అంటూ వేదక నుంచే మోదీ విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే ఆ కార్యకర్తకు పక్కనున్న వారు నీళ్లు ఇవ్వడంతో ఆయన తేరుకున్నట్టు సంకేతం ఇచ్చాడు. దాంతో ప్రధాని తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు.
అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే 'కాగ్' నివేదిక
'యమునా మాయి కీ జై' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...ఆప్‌దా ప్రభుత్వం నుంచి విముక్తులై బీజేపీ పాలనా శకం ప్రారంభం కానుండటంతో ఢిల్లీ ప్రజలు ఎంతో ఉపశమనంతో, ఉల్లాసంగా ఉన్నారని అన్నారు. 21వ శతాబ్దంలో సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని ఢిల్లీ వాసులందరికీ లేఖ రాశాననీ, ఈరోజు ఢిల్లీ ప్రజలంతా తనపై విశ్వాసం ఉంచినందుకు శిరస్సు వంచి అభివాదం చేస్తున్నానని అన్నారు. ఢిల్లీ శ్రీఘ్ర అభివృద్ధికి పాటుపడతానిని హామీ ఇచ్చారు. 'ఆప్' అవకతవకలపై కాగ్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే సభ ముందు ఉంచుతామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..
Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..
Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ
For More National News and Telugu News..