Share News

Saif Ali Khan: సైఫ్‌పై దాడి నిందితుడికి 5 రోజుల పోలీస్ కస్టడీ

ABN , Publish Date - Jan 19 , 2025 | 03:29 PM

ఈనెల 16వ తేదీ తెల్లవారుజామున దొంగతనం కోసం ముంబై బాంద్రా ఏరియాలోని సైఫ్ ఇంట్లోకి అడుగుపెట్టిన నిందితుడు ఆ క్రమంలోనే సైఫ్‌పై పదునైన బ్లేడుతో పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. శరీరంపై ఏడు చోట్ల గాయాలైన సైఫ్ ఆ వెంటనే నగరంలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు.

Saif Ali Khan:  సైఫ్‌పై దాడి నిందితుడికి 5 రోజుల పోలీస్ కస్టడీ

ముంబై: సైఫ్ అలీఖాన్‌ (Sai Ali Khan)పై ముంబై నివాసంలో దాడికి పాల్పడిన నిందితుడికి ముంబై కోర్టు జనవరి 24వ తేదీ వరకూ పోలీస్ కస్టడీ విధించింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు నిందితుడిని బాంద్రాంలోని హాలిడే కోర్టు ముందు ముంబై పోలీసులు హాజరుపరిచారు.

Delhi Elections 2025: భుములిస్తే ఇళ్లు కట్టిస్తా.. మోదీకి కేజ్రీవాల్ లేఖ


ఈనెల 16వ తేదీ తెల్లవారుజామున దొంగతనం కోసం ముంబై బాంద్రా ఏరియాలోని సైఫ్ ఇంట్లోకి అడుగుపెట్టిన నిందితుడు ఆ క్రమంలోనే సైఫ్‌పై పదునైన బ్లేడుతో పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. శరీరంపై ఏడు చోట్ల గాయాలైన సైఫ్ ఆ వెంటనే నగరంలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. అక్కడే ఆయనకు శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. నిందితుడి కోసం గాలించిన ముంబై పోలీసులు థానే జిల్లాలోని హీరానందని ఎస్టేట్‌ వద్ద అతన్ని ఆదివారం ఉదయం పట్టుకున్నారు. నిందితుడిని బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మది షరిఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించామన్నారు. అతను బిజాయ్ దాస్‌‌గా పేరు మార్చుకుని ఇండియాలోకి అడుగుపెట్టినట్టు తెలిపారు. చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ ఐదు నెలల నుంచి ముంబైలో ఉన్నట్టు చెప్పారు.


పోలీసుల వాదనను తోసిపుచ్చిన నిందితుడి లాయర్

కాగా, నిందితుడు బంగ్లాదేశ్‌ పౌరుడని పోలీసులు చెప్పడాన్ని బిజాయ్ దాస్ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. తన క్లయింట్ ఆరు నెలల క్రితం ఇక్కడక వచ్చినట్టు పోలీసులు చెప్పిన కథనంలో నిజం లేదని. ఏడేళ్లుగా అతని థానేలో తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడని చెప్పారు. ఇది పూర్తిగా 43ఎ ఉల్లంఘన కిందకు వస్తుందని, సరైన ఇన్వెస్టిగేషన్ జరగలేదని తెలిపారు. తన క్లయింట్‌కు 5 రోజుల పోలీస్ కస్టడీ విధించినట్టు చెప్పారు. ఇదే సమయంలో నిందితుడికి సంబంధించిన నివేదిక 5 రోజుల్లో సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించిందని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Saif Ali Khan: సినిమాలను మించే ట్విస్ట్.. సైఫ్ కేసులో నిందితుడ్ని ఎలా పట్టుకున్నారంటే..

Saif Ali Khan:ఆ పని కోసం సైఫ్ ఇంటికి వెళ్లి.. ఇంతలోనే..

Read Latest National News and Telugu News

Updated Date - Jan 19 , 2025 | 03:31 PM