Former Minister: బీజేపీ కూటమిలో చేరే ప్రసక్తే లేదు..
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:59 AM
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో చేరే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్(Former Minister D. Jayakumar) మరోమారు తేల్చిచెప్పారు.

- అన్నాడీఎంకే మాజీమంత్రి డి.జయకుమార్
చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో చేరే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్(Former Minister D. Jayakumar) మరోమారు తేల్చిచెప్పారు. స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో శుక్రవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ 108వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: Hero Vijay: తేల్చి చెప్పేసిన హీరో విజయ్.. విషయం ఏంటంటే..
అన్ని వర్గాల ప్రజలు లబ్ధిపొందే విధంగా ప్రభుత్వ పథకాలను అందించడంతో పాటు, కష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం చేసి ధర్మప్రభువుగా ఎంజీఆర్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వ హయాంలో రాష్ట్రప్రజలకు పొంగల్ కానుకగా రూ.2500తో పాటు, బియ్యం, చక్కెర, చెరకు గడ తదితరాలు పంపిణీ చేయడంపై విమర్శించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పొంగల్‌కు ప్రజలకు మొండి చెయ్యి చూపించారని వ్యాఖ్యానించారు.
ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గ ఉపఎన్నిక పారదర్శకంగా జరిగే అవకాశం లేనందు వల్లే అన్నాడీఎంకే బహిష్కరించిందే గానీ, డీఎంకే చెబుతున్నట్లు ఓటమి భయంతో కాదన్నారు. మతవాదాన్ని రెచ్చగొడుతున్న బీజేపీతో ఎట్టి పరిస్థితిలోనూ అన్నాడీఎంకే చేతులు కలపదని, పొత్తుల గురించి బీజేపీ నేతలు చెబుతున్నవన్ని అబద్ధాలేనని జయకుమార్ అన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?
ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు
ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ
ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News