Share News

Allahabad High Court: బాలిక ఛాతీ తాకడం రేప్‌ కిందికి రాదు

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:52 AM

ఒక బాలికను చిన్న వంతెన కిందకు తీసుకెళ్లి ఆమె ఛాతీపై చేయి వేయడంతో పాటు, ఆమె ధరించిన పైజామా తాడును లాగారంటూ పవన్‌, ఆకాశ్‌ అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదయింది. ఐపీసీలోని సెక్షన్‌ 376 (రేప్‌), పోక్సో చట్టంలోని సెక్షన్‌ 18 (నేరానికి ప్రయత్నించడం) కింద పోలీసులు కేసు పెట్టారు.

 Allahabad High Court: బాలిక ఛాతీ తాకడం రేప్‌ కిందికి రాదు

రేప్‌ కేసులో అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం

ప్రయాగ్‌రాజ్‌, మార్చి 20: మైనర్‌ బాలిక ఛాతీని తాకడం, ఆమె పైజామా తాడును లాగివేయడం రేప్‌ కిందకు రాదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. దానిని అంతకన్నా తక్కువ నేరం కింద పరిగణించి కేసును మార్చాలని ఆదేశించింది. ఒక బాలికను చిన్న వంతెన కిందకు తీసుకెళ్లి ఆమె ఛాతీపై చేయి వేయడంతో పాటు, ఆమె ధరించిన పైజామా తాడును లాగారంటూ పవన్‌, ఆకాశ్‌ అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదయింది. ఐపీసీలోని సెక్షన్‌ 376 (రేప్‌), పోక్సో చట్టంలోని సెక్షన్‌ 18 (నేరానికి ప్రయత్నించడం) కింద పోలీసులు కేసు పెట్టారు. ఇవి తీవ్రమైన సెక్షన్లు కావడం, కఠిన శిక్షలు పడే అవకాశం ఉండడంతో వాటిని మార్చాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ రామ్‌ నారాయణ్‌ మిశ్ర.. ఆ సెక్షన్లు మార్చి అంతకన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్లు నమోదు చేయాలని ఆదేశించారు. సాక్ష్యాలను పరిశీలిస్తే నిందితులిద్దరూ ఆ బాలికపై అత్యాచారం చేయడానికి సిద్ధమయ్యారంటూ నిర్ధారించలేమని తెలిపారు. అందువల్ల తక్కువ శిక్ష పడే ఐపీసీలోని సెక్షన్‌ 354బీ (బలవంతంగా దుస్తులను లాగడం), పోక్సో చట్టంలోని 9/10 సెక్షన్లు (లైంగిక దాడి) కింద మళ్లీ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

Shocking Video: నాదే తప్పు అయితే.. ఇక్కడి నుంచి వెళ్లిపోతా.. బస్సు డ్రైవర్ ఏం చేశాడో చూస్తే నివ్వెరపోవడం ఖాయం..

Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..

Updated Date - Mar 21 , 2025 | 04:52 AM