Share News

Viral Video: ఇన్‌స్టా లవ్.. ప్రియురాలిని కలవడానికి వెళ్లి..

ABN , Publish Date - Mar 28 , 2025 | 05:58 PM

కొద్దిరోజుల క్రితం బబ్లూ అనే వ్యక్తి తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేశాడు. ఇప్పుడు మరో ఘటనలో ప్రియురాలిని కలవడానికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రియురాలితో కలిసి ఉండగా ఆమె తల్లిదండ్రులు పట్టుకున్నారు.

Viral Video: ఇన్‌స్టా లవ్.. ప్రియురాలిని కలవడానికి వెళ్లి..
Instagram love

కొంతమందికి ప్రేమ అంటే పెళ్లి.. మరికొంత మందికి ఎంజాయ్‌మెంట్.. ఓ అవసరం. పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశ్యంతో ప్రేమించే వాళ్లు మూడు ముళ్లబంధంతో ఒక్కటవుతారు. ఎంజాయ్‌మెంట్ కోసమో.. అవసరం కోసమో ప్రేమిస్తున్నట్లు నటించే వారు.. కోరిక తీరగానే ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు. ఇలాంటి వాళ్లను సడెన్‌గా పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తే.. వారి బాధ వర్ణణాతీతం. ఉత్తర భారత దేశంలో చాటు మాటుగా కలుస్తున్న ప్రేమికులకు పెద్దలు షాక్ ఇస్తున్నారు. కలిసి కనబడితే చాలు పెళ్లి చేసేస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి వరుసగా ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తాజాగా, ప్రియురాలిని కలవడానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఆమె కుటుంబసభ్యులు, ఊరి జనం షాక్ ఇచ్చారు.


ఇద్దరికీ బలవంతంగా పెళ్లి చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని జలౌన్‌కు చెందిన ఓ యువతీ, యువకుడు గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం సదరు యువకుడు ప్రియురాలిని కలవడానికి ఆమె ఊరికి వెళ్లాడు. ఇద్దరూ ఓ చోట కలుసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అటుగా వెళుతున్న కొంతమంది ఊరి జనం వాళ్లను చూశారు. యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. వాళ్లు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. ఇద్దర్నీ పట్టుకున్నారు. ఓ గుడి దగ్గరకు తీసుకువచ్చారు. ఇద్దరికీ బలవంతంగా పెళ్లి చేశారు. యువకుడు అయిష్టంగానే యువతి మెడలో తాళి కట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ప్రియుడితో భార్యకు పెళ్లి..

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బబ్లూ అనే వ్యక్తి తన భార్యకు ప్రియుడితో పెళ్లి చేశాడు. దగ్గరుండి మరీ వారి వివాహతంతు జరిపించాడు. అంతేకాదు.. ఇద్దరు పిల్లల బాధ్యత తానే చూసుకుంటానని కూడా భరోసా ఇచ్చాడు. పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ బబ్లూ చేసిన పనిపై ప్రశంసలు కురిపించారు. అయితే, ఈ స్టోరీలో ఓ ట్విస్ట్ బయటపడింది. చావు భయంతోనే తాను పెళ్లి చేశానని అతడు మీడియాకు తెలిపాడు. ప్రేమించిన వాడి కోసం భర్తను చంపుతున్న మహిళల సంఖ్య పెరుగుతోందని, ఆమె మీద అరిచినా.. గొడవపెట్టుకున్నా లాభం లేదని అర్థం అయ్యి పెళ్లి చేశానని అన్నాడు. బబ్లూ తెలివికి జనం ఫిదా అవుతున్నారు.


ఇవి కూడా చదవండి:

ప్రియురాలి ఇంటికి పోతున్నావా?..

Viral Video: గర్ల్స్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం.. భయానక దృశ్యాలు..

UP: భార్యకు లవర్‌తో వివాహం.. అసలు కారణం ఇదే

Updated Date - Mar 28 , 2025 | 06:25 PM