జీపాట్ 2025
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:59 AM
గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీపాట్) 2025కి సంబంధించిన నోటిఫికేషన్‌ను ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎమ్‌ఎస్) విడుదల చేసింది...

గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీపాట్) 2025కి సంబంధించిన నోటిఫికేషన్‌ను ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎమ్‌ఎస్) విడుదల చేసింది. ఎంఫార్మసీ అడ్మిషన్స్ కోసం ఉద్దేశించిన ఈ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రెన్స్ 2025 మే 25న జరుగుతుంది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అవుతుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ుఽ్చ్టఛ్చౌటఛీ.్ఛఛీఠ.జీుఽ లింక్ యాక్టివేట్ అయిన తరవాత దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ తరవాత, నాలుగు సంవత్సరాల ఫార్మసీ విద్య పూర్తిచేసుకున్న అభ్యర్థులు దరఖాస్తునకు అర్హులు. అభ్యర్థులకు ఎలాంటి వయో పరిమితి లేదు. మే 21న హాల్ టికెట్లు విడుదల చేస్తారు. మే 25న పరీక్ష కాగా, ఫలితాలను జూన్ 25న వెల్లడించే అవకాశం ఉంది. జీపాట్ అడ్మిషన్ ప్రొసీజర్ ప్రారంభం కంటే ముందే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంటే బీఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.3500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.2500. పూర్తి వివరాలకు ఎన్‌బీఈఎమ్‌ఎస్ వెబ్‌సైట్ చూడవచ్చు.
ఇవి కూడా చదవండి:
ప్రభుత్వ స్కీంలో కోటి రూపాయలు సంపాదించడం ఎలా..నెలకు ఎంత సేవ్ చేయాలి..
గోల్డ్‌కు గట్టి పోటీ ఇస్తున్న వెండి..ఏడాదిలో ఎంత పెరిగిందో తెలుసా..